గ్రేటర్‌లో తగ్గుతున్న కరోనా కేసులు: 509 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1764..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సోమవారం 1610 మందికి రాగా.. నిన్న 1764 మందికి వైరస్ వచ్చింది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు 18,858 నమూనాలను పరీక్షించగా.. 1,764 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వైరస్ సోకిన 12 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 492కి చేరింది.

1764 corona cases are register in the telangana state

Recommended Video

    CM YS Jagan - 'ప్రజలు పెట్టుకునే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారమవ్వాలి' || Oneindia Telugu

    రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 58,906 అని వైద్యారోగ్యశాఖ పేర్కొంది. వైరస్ తగ్గడంతో 43,751 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 509 కరోనా కేసులు వచ్చాయి. సోమవారం 531 రాగా.. మరుసటి రోజు కాస్త తగ్గాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 158, రంగారెడ్డి 147, వరంగల్ అర్బన్ 138లో పాజిటివ్ కేసులు వచ్చాయి. కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 93 కేసులు రావడంతో ఆందోళన నెలకొంది. ఖమ్మం 69, నల్గొండలో 51, పెద్దపల్లిలో 44, మహబూబ్ నగర్ 47 చొప్పున కేసులు వచ్చాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+