తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: 189, హైదరాబాద్‌లో కొత్తగా ఎన్నంటే?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. మంగళవారం రాత్రి 8 గంటల వరకు 39,000 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 189 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,00,342కి చేరింది. ఈ మేరకు బుధవారం ఉదయం వైద్యారోగ్యశాఖ వివరాలను వెల్లడించింది.

మంగళవారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 1,646కి చేరింది. కరోనా బారి నుంచి మంగళవారం 176 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 2,96,916కి చేరింది.

189 new corona cases reported in Telangana: Two deaths in last 24 hours.

జీహెచ్ఎంసీ పరిధిలో మరో 34 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1780 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 693 మంది హోం- ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 90,55,741 కరోనా నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

మరోవైపు దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 17,921 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,12,62,707కు చేరింది. అయితే, గత ఒక్కరోజు వ్యవధిలో 20,652 మంది కరోనా నుంచి కోలుకోవడం కొంత ఊరటనిచ్చే విషయం.
కాగా, ఇప్పటి వరకు 1,09,20,046 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 96.90 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 133 మంది మరణించారు. ఇప్పటి వరకు 1,58,063 మంది ఈ మహమ్మారితో మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,84,598 యాక్టివ్ కేసులున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+