206 రాళ్లు తీసేశారు.. సిటీలో రేర్ ఆపరేషన్, సమ్మర్‌లో ఇలా చేయాలంటూ డాక్టర్స్ సజెషన్
కిడ్నీలు రాళ్లు చిన్నగా ఉంటే మందులతో నయం అవుతున్నాయి. వాటి సైజ్ పెరిగితే సర్జరీ తప్పదు. స్టోన్స్ ఉంటే నొప్పి మాములుగా ఉండదు. సర్జరీ కోసం ఆధునాతన పద్ధతులు వచ్చాయి. దాదాపు లేజర్ ద్వారా సర్జరీ జరుగుతున్నాయి. అప్పుడప్పుడు కొందరికీ ఎక్కువగా స్టోన్స్ ఉన్నట్టు అనిపిస్తాయి. అవును అలాంటివి చాలా సందర్భాల్లో మనం విన్నాం. చూశాం.. కూడా.. హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఒక అరుదైన సర్జరీ జరిగింది.

206 రాళ్లు
అవారె గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్‌లో కీహోల్ సర్జరీని చేశారు. గంటల సమయంలోనే 206రాళ్లను తొలగించారు. ఆరు నెలలుగా బాధపడుతున్న పేషెంట్‌కు ఉపశమనం కలిగించారు. నల్గొండకు చెందిన వీరమళ్ల రామలక్ష్మయ్య కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతున్నాడు. ఏప్రిల్ 22వ తేదీన అవారె గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యులను కలిశాడు. తను లోకల్‌గా వైద్యులు ఇస్తోన్న మందులు వాడుతున్నా.. అప్పటి వరకు మాత్రమే రిలీఫ్ ఇస్తున్నారు. దీంతో హైదరాబాద్ వచ్చాడు.

చాలా రాళ్లు గుర్తించాం..
పేషెంట్‌ను వైద్యులు పరీక్షించారు. అల్ట్రా సౌండ్ లాంటి వైద్యపరీక్షలు చేసి లెఫ్ట్ సైడ్ కిడ్నీలో చాలా రాళ్లు ఉన్నాయని గుర్తించారు. సీటీ స్కాన్‌లో కూడా అదే కన్ఫామ్ అయిందని చెప్పారు. పేషెంట్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి కీ హోల్ సర్జరీకి ప్రయత్నించారు. గంటపాటు జరిగిన సర్జరీలో 206రాళ్లను తొలగించారు. తర్వాత పేషెంట్ కోలుకున్నారని.. రెండో రోజే ఇంటికి డిశ్చార్జ్ చేశాం అని వైద్యులు చెబుతున్నారు.

సమ్మర్‌లో ఇబ్బందులు
కిడ్నీలో రాళ్లు ఉండటం వల్ల సమ్మర్‌లో ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. రాళ్లు ఉన్న వారు డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు. జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఎక్కువగా నీళ్లు, కొబ్బరి నీళ్లు తాగుతుండాలని వైద్యులు చెబుతున్నారు. అలా చేస్తేన సీజన్ నుంచి ఉపశమనం లభిస్తోందని వైద్యులు చెబుతున్నారు.