హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో కరోనా కల్లోలం: 2 వేల పైచిలుకు కేసులు.. 9 మంది మృత్యువాత...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కూడా 2 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు వచ్చాయి. 2 వేల 123 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వైరస్ సోకిన మొత్తం సంఖ్య లక్ష 69 వేల 169కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. 2 వేల 151 మంది వైరస్ నుంచి కోలుకున్నారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చిన వారి సంఖ్య 1 లక్ష 37 వేల 508కి చేరింది.

మంత్రి ఈటల పేషిలో కరోనా కలకలం: ఏడుగురికి పాజిటివ్, శుక్రవారం ఇంట్లోనే ఆమాత్యులు..మంత్రి ఈటల పేషిలో కరోనా కలకలం: ఏడుగురికి పాజిటివ్, శుక్రవారం ఇంట్లోనే ఆమాత్యులు..

9 మంది మృతి..

9 మంది మృతి..

కరోనా వైరస్ వల్ల 9 మంది చనిపోయారు. దీంతో మృతిచెందిన వారి మొత్తం సంఖ్య 1025కి చేరింది. మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30 వేల 636 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 305 కేసులు రాగా.. రంగారెడ్డి 185, మేడ్చల్‌ 149, నల్గొండ 135, కరీంనగర్‌‌లో 112 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి.

నిన్న కూడా..

నిన్న కూడా..

ఇక నిన్న కూడా 2 వేల 43 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చాయి. 1,802 మంది డిశ్చార్జి అయ్యారు. కానీ శనివారం నాటికి ఆ సంఖ్య పెరిగింది. వైరస్‌తో 11 మంది మృతి చెందారు. కానీ మృతుల సంఖ్య కూడా కాస్త తగ్గింది. 9 మంది చనిపోయారు.

దేశంలో విజృంభణ

దేశంలో విజృంభణ

ఇటు దేశవ్యాప్తంగా 92 వేల 969 కరోనా కేసులు వచ్చాయి. 95 వేల 512 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం 53.05 లక్షల కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, 42 లక్షల 5 వేల 201 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 10 లక్షల 15 వేల 981 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్ సోకి 85 వేల 625 మంది చనిపోయారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 21,656 కేసులు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో కొత్తగా 2,552 కరోనా కేసులు నమోదు కాగా, రాజస్థాన్‌ 1,817, బీహార్ 1,147, ఉత్తరప్రదేశ్‌లో 6,494 కేసులు వచ్చాయి.

Recommended Video

#Coronavirusindia : భారత్ లో రికార్డు స్థాయి లో నమోదు అవుతున్న Corona కేసులు | #IndiaFightsCorona

English summary
2123 corona cases register in telangana state and 9 people dead health officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X