హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

27 వేల మంది పోలీసు సిబ్బంది, నిమజ్జనానికి ఏర్పాట్లు: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

|
Google Oneindia TeluguNews

వినాయక నిమజ్జనంపై క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19వ తేదీన నిర్వహించే గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. నిమజ్జన ఏర్పాట్లకు ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయని పేర్కొన్నారు. శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసు, ట్రాపిక్ పోలీసు, జీహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, ఆర్అండ్ బీ, ఎలక్ట్రికల్ తదితర అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయనున్నారని మంత్రి తెలిపారు.

కంట్రోల్ రూమ్.. 24 క్రేన్లు

శోభాయాత్ర, నిమజ్జనం పర్యవేక్షణ కోసం వివిధ శాఖల అధికారులతో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విగ్రహాల నిమజ్జనం జరిగే హుస్సేన్ సాగర్ పరిసరాల్లో 24 క్రేన్‌లతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో నిమజ్జనం కోసం గుర్తించిన పలు రిజర్వాయర్లు, 25 చెరువులు, 25 బేబీ పాండ్స్ వద్ద మొత్తం 300 క్రేన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 100 మంది గజ ఈతగాళ్ళను కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందని వివరించారు. మండపాల నిర్వహకుల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా జనరేటర్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. నిమజ్జనం కోసం విగ్రహాలను తీసుకెళ్లేందుకు మండపాల నిర్వహకులకు అవసరమైన వివిధ రకాల వాహనాలు వెయ్యి వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 10 పాయింట్స్‌లలో అందుబాటులో ఉంచడం జరిగిందని, వీటి పర్యవేక్షణ కోసం 30 మంది ఆర్టీఏ అధికారులు, ఇన్‌స్పెక్టర్లను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు తొలగింపు

విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు తొలగింపు


విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే రహదారులలో అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను, చెట్ల కొమ్మలను తొలగించాలని ఆదేశించారు. ట్రాపిక్ పోలీస్, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, వాహనదారులు, భక్తులు ఇబ్బందులకు గురికాకుండా ట్రాపిక్ డైవర్షన్ చేయాలని చెప్పారు. అవసరమైన ప్రాంతాలలో మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాలలో.. శోభాయాత్ర నిర్వహించే రహదారులలో ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ జరిగేలా 8,160 మంది సిబ్బందితో శానిటరీ సూపర్ వైజర్ లేదా ఎస్ఎఫ్ఏల ఆధ్వర్యంలో 215 ప్రత్యేక బృందాలను నియమించడం జరుగుతుందని పేర్కొన్నారు.

Recommended Video

Prithvi Shaw Stopped By Police క్రికెటర్ అయినా రూల్స్... పృథ్వీ షా కి చుక్కలు || Oneindia Telugu
27 వేలకు పైగా పోలీసులు

27 వేలకు పైగా పోలీసులు


శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు 27,955 మంది వివిధ స్థాయిలలోని పోలీసు సిబ్బందితోపాటు గ్రే హ్యాండ్స్, ఆక్టోపస్ దళాలు కూడా బందోబస్తు విధులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది కూడా నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సంజీవయ్య పార్క్, జేమ్స్ స్ట్రీట్, బేగంపేట రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేకంగా ఎంఎంటీఎస్ రైళ్ళను నడపనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు, ఉత్సవాల నిర్వహకులు కూడా ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోరారు.

English summary
27 thousanad cops are to works ganesh immersion minister talasani srinivas yadav said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X