హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎర్రగడ్ర పిచ్చి ఆస్పత్రిలో 36 మందికి కరోనా.. సిబ్బందితోపాటు రోగులకు కూడా.. మరో 200 మంది..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజు వెయ్యికి పైచిలుకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కానీ గ్రేటర్ పరిధిలో మాత్రం కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే గత 24 గంటల్లో రాష్ట్రంలో 894 కరోనా వైరస్ కేసులు రాగా.. గ్రేటర్ పరిధిలో 147 కేసులు వచ్చాయి. అయితే ఇందులో ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో భారీగా కేసులు వచ్చాయి. దీంతో ఆందోళన నెలకొంది.

ఎర్ర‌గ‌డ్డ మెంట‌ల్ ఆస్పత్రిలో 36 పాజిటివ్ కేసులు వచ్చాయి. 36 మందిలో ఆస్ప‌త్రి సిబ్బందితోపాటు మాన‌సిక రోగులు కూడా ఉన్నారు. వీరిని అక్క‌డే గల కోవిడ్ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. వీరు కాక మరో 200 మంది కరోనా వైరస్ కోసం చికిత్స తీసుకుంటున్నారు. వీరితో కలిపి ఆ సంఖ్య 236కి చేరింది. కానీ ఓకేరోజు 36 మందికి వైరస్ రావడంతో కాస్త ఆందోళన కలిగిస్తోంది. రోగులకు ఎవరికీ వచ్చింది, సిబ్బంది బయటకెళ్లడంతో సోకిందా.. తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

36 patients in hyderabad erragadda mental hospital test positive

894 పాజిటివ్ కేసులో మొత్తం కేసుల సంఖ్య 92 వేల 255కి చేరింది. గత 24 గంటల్లో 10 మంది చనిపోగా.. మొత్తం మరణించిన వారి సంఖ్య 703కు చేరింది. 2 వేల 6 మంది వైరస్‌ బారి నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిపోయారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 70 వేల 132 మందికి చేరింది. 21వేల 420 మంది మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో ఇంట్లో, ఐసోలేషన్‌ కేంద్రాల్లో 14 వేల 404 మంది ఉన్నారు.

English summary
36 patients in hyderabad erragadda mental hospital test positive. staff and patients infected coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X