కరోనా అప్‌డేట్... తెలంగాణలో కొత్తగా 397 కేసులు.. మరో ఇద్దరు మృతి...
తెలంగాణలో కొత్తగా 397 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. మరో 496 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (డిసెంబర్ 28) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,465కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1535కి చేరింది. ప్రస్తుతం 5998 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 3838 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 627 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,77,931కి చేరింది.

గడిచిన 24గంటల్లో మొత్తం 42,737 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 67,93,691కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,82,527 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 95.9 శాతం ఉండగా తెలంగాణలో 97.36శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 92 కేసులు ఉన్నాయి.
మరోవైపు యూకెలో వెలుగుచూసిన కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్‌కు సంబంధించిన కేసు తెలంగాణలోనూ బయటపడింది. డిసెంబర్ 10న యూకె నుంచి వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చిన ఓ వ్యక్తి(49)కి కొత్త రకం కరోనా వైరస్ సోకినట్లుగా నిర్దారణ అయింది. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ఈ విషయాన్ని ప్రభుత్వానికి వెల్లడించింది. సీసీఎంబీలో అతని శాంపిల్స్ నుంచి వైరస్ జీనోమ్‌ను విశ్లేషించగా ఈ విషయం నిర్దారణ అయింది. అతని తల్లి(71)కి కూడా కరోనా పాజిటివ్‌గా తేలగా... ఆమెకు సోకింది కొత్త వైరసా లేక పాత వైరసా అన్నది ఇంకా నిర్దారించాల్సి ఉంది. ఇందుకోసం ఆమె శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ నిమిత్తం సీసీఎంబీ ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
కాగా,డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకూ తెలంగాణకు మొత్తం 1216 మంది ప్రయాణికులు వచ్చినట్లు గుర్తించామని రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. వీరిలో ఇప్పటికే 1060 మందిని ట్రాక్ చేసినట్లు తెలిపారు. మరో 58 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోగా... ఆరుగురు విదేశాలకు వెళ్లిపోయినట్లు గుర్తించామన్నారు. మిగిలిన 996 మందికి కరోనా నెగటివ్‌గా నిర్దారణ అయిందని తెలిపారు. పాజిటివ్‌గా తేలిన 21 మదిలో మరో 9 మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందన్నారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications