జితేందర్ రెడ్డి ఇంట్లో కిడ్నాప్ కలకలం..? నలుగురు మిస్సింగ్, కేసు ఫైల్ చేయలే
మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటిలో నలుగురు వ్యక్తులు కిడ్నాప్‌కు గురయ్యారు. ఈ విషయం కలకలం రేపుతోంది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని జితేందర్ రెడ్డి నివాసంలో ఘటన జరిగింది. కిడ్నాప్‌పై జితేందర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది ఢిల్లీలోని సౌత్ ఎవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై ఇంకా కేసు నమోదు చేయలేదు. సదరు ఫిర్యాదును పరిశీలనలో పెట్టారని తెలిసింది.
ఢిల్లీ సౌత్ ఎవెన్యూలోని నెంబర్ 105 ఇంటిలో జితేందర్ రెడ్డి నివాసం ఉంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించారు. జితేందర్ రెడ్డి కారు డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులను బలవంతంగా లాక్కెళ్లారట. ఈ హఠాత్ పరిణామం నుంచి తేరుకున్న జితేందర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జితేందర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది పోలీసులను కోరారట.

ఘటన గురించి ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ.. పోలీసులు స్పందించలేదు. దీంతో సందేహాం కలుగుతుంది. ఏకంగా నలుగురు కనిపించకపోవడం సందేహాలకు తావిస్తోంది. ఇంటికి వచ్చి మరీ కిడ్నాప్ చేసేంత ఏముంటుందనే చర్చ జరుగుతుంది. కానీ మిస్సయిన వారు వస్తే తప్ప.. ఏం జరిగిందో తెలియదు. లేదంటే పోలీసు విచారణ షురూ కావాల్సి ఉంది.
జితేందర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఓడిపోయారు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కేసీఆర్‌తో చెడటంతో.. పార్టీ వీడాల్సి వచ్చింది. ఆ సమయంలో టీఆర్ఎస్ ప్లోర్ లీడర్‌గా కూడా పనిచేశారు. అంతకుముందు టీడీపీలో ఉండేవారు. మార్పు కోసం టీఆర్ఎస్‌లో చేరి.. అటు నుంచి బీజేపీలోకి వచ్చారు.












Click it and Unblock the Notifications