గ్రేటర్ పోల్స్: 45వేల మంది సిబ్బంది -వారంలోగా ఓటర్ స్లిప్పుల పంపిణీ -లోకేశ్ కుమార్ కీలక ఆదేశాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నగరా మోగడంతో అధికార యంత్రాంగం అలెర్టయింది. ఎన్నికల అధికారి హోదాలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పోలింగ్ సంబంధిత ఏర్పాట్లపై మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని నోడల్‌ ఆఫీసర్లకు ఆయన సూచించారు.

మొత్తం 45 వేల మంది సిబ్బంది..

మొత్తం 45 వేల మంది సిబ్బంది..

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు 45 వేల మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు కమిషనర్ లోకేశ్ తెలిపారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ నెల 25లోగా ఓటర్లకు ఓటరు స్లిప్‌ల పంపిణీ పూర్తి చేస్తామని అన్నారు. మైక్రో అబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్ వాలంటీర్ల నియామకం వెంటనే చేపట్టాలని నోడల్ ఆఫీసర్లకు సూచించారు. గ్రేటర్‌ పరిధిలోని 150 వార్డులకు డిసెంబర్ 1న పోలింగ్ జరుగనుంది. ఏవైనా అవాంతరాలు ఏర్పడితే ఆయా పోలింగ్ కేంద్రాల్లో డిసెంబర్ 3న రీపోలింగ్ చేపడతారు. డిసెంబర్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

 కోడ్ కఠినంగా అమలు చేయండి..

కోడ్ కఠినంగా అమలు చేయండి..

నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మంగళవారం నుంచి హైదరాబాద్ అంతటా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. కోడ్ ను పకడ్బందీగా అమలు చేయాలని, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రదేశాల్లో రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌ కుమార్‌ అధికారుల్ని ఆదేశించారు. అదేసమయంలో ఎన్నికల ఫిర్యాదులు, విజ్ఞాప‌న‌ల స్వీకరణకు జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌తో పాటు అన్ని జోనల్, డిప్యూటి కమిషనర్ కార్యాలయాలలో ఎన్నికల కాల్ సెంటర్ల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి చేయాలని ఆదేశించారు.

 ఈసారి మేయర్‌.. జనరల్‌ మహిళ

ఈసారి మేయర్‌.. జనరల్‌ మహిళ

గ్రేటర్ ఎన్నికల్లో ఆయా డివిజన్లు, మేయర్ పదవికి రిజర్వేషన్ల కేటాయింపులు ప్రభుత్వ వ్యవహారమని, 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లే ఇప్పుడూ కొనసాగిస్తామని, అయితే మేయర్ పదవిని మాత్రం జనరల్‌ మహిళకు కేటాయించినట్లు ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి చెప్పారు. 150 వార్డులకుగానూ రెండు వార్డులు ఎస్టీలు, 10 వార్డులు ఎస్సీలకు, 50 బీసీలకు, జనరల్‌ మహిళ 44, మరో 44 స్థానాలు జనరల్‌కు రిజర్వు చేసినట్లు వివరించారు. అధికారిక లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 74,04,000 మందికి పైగా ఓటర్లున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో సంఖ్య పెంచి, మొత్తం 9,248 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+