32 మరణాలు.. 5 వేల లోపు కేసులు, తెలంగాణలో కరోనా కల్లోలం..
కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. ఏ గల్లీ.. వీధిని కూడా వైరస్ వదల్లేదు. దాదాపు ప్రతీ ఇంట్లో ఒక్కరు కరోనా బారిన పడ్డారు. ఫస్ట్ వేవ్ కన్నా.. సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది. గాలి ద్వారా వైరస్ సోకడంతో వేగంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే చాలా మంది భయాందోళనకు గురవడంతో మరణాలు పెరుగుతున్నాయి. చనిపోయిన వారిలో యువత ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైరస్ రుపాంతరం చెందుతూ.. ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం చూపుతోంది.
Recommended Video
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 65,923 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 4,826 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 723 కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా నారాయణ్ పేట్ జిల్లాలో 5 కేసులు గుర్తించారు. 7,754 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. వైరస్ సోకిన 32 మంది మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 5,02,187 పాజిటివ్ కేసులు వచ్చాయి. 4,36,619 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా మరణాల సంఖ్య 2,771కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 82.3 శాతం కాగా, తెలంగాణ రాష్ట్రంలో 86.94 శాతానికి పెరిగింది. ఇదీ కాస్త సానుకూల అంశం కాగా.. మరణాల సంఖ్య కూడా ఆందోళనకు గురిచేస్తోంది.












Click it and Unblock the Notifications