తెలంగాణల నో కరోనా.. కొత్తగా 67 మందికి పాజిటివ్
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వేల నుంచి వంద లోపు వరకు వచ్చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 21,843 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 67 మందికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాదులో 19 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 9 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 152 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,418 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,85,442 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 865 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

కేసులు రావడంతో ఊపిరి పీల్చుకునే పరిస్థితి. అలాగే దేశవ్యాప్తంగా కూడా గణనీయంగా కేసులు తగ్గుతున్నాయి. 4 వేల లోపే కేసులు వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో జీరో కేసులు వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చిన వారు కూడా 3 రోజుల్లో పూర్తిగా కోలుకుంటున్నారు. ఇక ఢిల్లీ అయితే ఏకంగా.. కారులో మాస్క్ తప్పనిసరి కాదని స్పష్టంచేసింది. అలాగే ఆఫ్ లైన్ స్కూళ్ల నిర్వహణకు అనుమతి ఇచ్చింది.












Click it and Unblock the Notifications