తెలంగాణలోనూ భారీగా తగ్గిన కేసులు.. జీరో మరణాలు

తెలంగాణకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 52వేల 714 కరోనా టెస్టులు చేయగా, కొత్తగా 683 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,83,019కి చేరింది. రాష్ట్రంలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించ లేదు. కరోనా బారి నుంచి నిన్న 2వేల 645 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,674 కోవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 168 కేసులు వచ్చాయి.

 683 people infected corona in telangana

ఇటు దేశవ్యాప్తంగానూ కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. తాజాగా కొత్త కేసులు 50 వేలకు దిగొచ్చాయి. శుక్రవారం 14 లక్షల మందికి కరోనా టెస్తులు చేయగా.. 50 వేల 407 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. ముందురోజు కంటే కేసులు 13 శాతం మేర తగ్గాయి. పాజిటివిటీ రేటు 3.48 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో యాక్టివ్ కేసులు 6 లక్షల (1.43 శాతానికి) పడిపోయాయి. నిన్న ఒక్కరోజే 1,36,962 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ రెండేళ్ల వ్యవధిలో 4.25 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.14 కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 97.37 శాతానికి పెరిగింది. 24 గంటల వ్యవధిలో 804 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. క్రితం రోజుతో పోలిస్తే మరణాల సంఖ్య 657 పెరిగింది. దేశంలో ఇప్పటివరకు వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య 5,07,981 పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+