తెలంగాణలో భారీగా తగ్గుముఖం: 729 కేసులు.. ఆరుగురు మృతి, ఏ జిల్లాలో ఎన్ని అంటే..

కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 729 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. కొత్తగా 987 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. వైరస్‌ ప్రభావంతో ఆరుగురు చనిపోయారు. 729 కేసులను కలిపితే మొత్తం కేసుల సంఖ్య 6,30,514కు చేరింది. ఇప్పటి వరకు 6,15,852 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 3,720 మంది మృత్యువాతపడ్డారు.

రాష్ట్రంలో 10,942 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఒకే రోజు 1,06,045 కొవిడ్‌ నమూనాలను పరిశీలించినట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 0.58శాతంగా ఉందని, రికవరీ రేటు 97.67శాతంగా ఉందని చెప్పింది. కొత్తు కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎం పరిధిలో 72, ఖమ్మంలో 72, నల్లగొండలో 59, వరంగల్‌ అర్బన్‌లో 51, కరీంనగర్‌లో 42, రంగారెడ్డిలో 38, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 35, పెద్దపల్లిలో 32, కొత్తగూడెంలో 31, మహబూబాబాద్‌లో 30 కేసులు వచ్చాయి.

729 people infected corona in telangana

ఆదిలాబాద్ 03 కేసులు.. జగిత్యాల 19. జనగామ 06. జయశంకర్ భూపాలపల్లి 15. జోగులాంబ గద్వాల 02. కొమరం భీం ఆసిఫాబాద్ 04. మహబూబ్ నగర్ 06, మంచిర్యాల 45. మెదక్ 04. ములుగు 21. నాగర్ కర్నూలు 05. నారాయణపేట 03. నిజామాబాద్ 04 పెద్దపల్లి 32. రాజన్న సిరిసిల్ల 22. సంగారెడ్డి 14. సిద్దిపేట 27. సూర్యాపేట 24. వికారాబాద్ 06. వనపర్తి 10. వరంగల్ రూరల్ 07. యాదాద్రి భువనగిరి 20 కేసులు వచ్చాయి. మొత్తం కేసులు 729 వచ్చాయి.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+