హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

75 ఏళ్ల వృద్దుడు కోలుకున్నాడు, పరీక్షలు చేయడం లేదనడం సరికాదు, 10 కొత్త కేసులు: మంత్రి ఈటల

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయగలిగామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. వైరస్ సోకిని 75 ఏళ్ల వృద్దుడు కూడా కోలుకున్నాడని ఆయన చెప్పారు. కానీ కొందరు పరీక్షలు చేయడం లేదు అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైరస్ ప్రబలిన రోగులుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని కొనియాడారు. గాంధీ వైద్యుల సేవలను మరవలేమని.. గొప్పగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.

coronavirus: అందుబాటులోకి గచ్చిబౌలి క్వారంటైన్ సెంటర్..?, 1500 మందికి చికిత్స: మంత్రి ఈటల..coronavirus: అందుబాటులోకి గచ్చిబౌలి క్వారంటైన్ సెంటర్..?, 1500 మందికి చికిత్స: మంత్రి ఈటల..

కంటైన్మెంట్ జోన్లపై ఫోకస్..

కంటైన్మెంట్ జోన్లపై ఫోకస్..


కంటైన్మెంట్ జోన్లలో కరోనా వైరస్ అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వైరస్ నివారణ కోసం సిబ్బంది సమిష్టిగా కృషిచేస్తున్నారని తెలిపారు. శుక్రవారం మరో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఆయన చెప్పారు. వైరస్ సోకిన మొత్తం సంఖ్య 1132కి చేరిందని చెప్పారు. 727 మందికి వైరస్ తగ్గడంతో డిశ్చార్జ్ చేశామని తెలిపారు. శుక్రవారం 34 మందిని ఇంటికి పంపించామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 376 మందికి చికిత్స అందిస్తున్నామన్నారు.

14 జిల్లాలు కూడా గ్రీన్ జోన్

14 జిల్లాలు కూడా గ్రీన్ జోన్

రాష్ట్రంలో వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఈటల రాజేందర్ తెలియజేశారు. ప్రస్తుతం 9 జిల్లాలు గ్రీన్ జోన్లు పరిధిలో ఉన్నాయని.. మరో 14 జిల్లాలు కూడా ఆరంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్‌లోకి వెళతాయని చెప్పారు. దీనికి సంబంధించి కేంద్రానికి నివేదిక అందజేశామని.. సోమవారం ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పారు. సూర్యాపేట, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాలను ఆరంజ్ జోన్లలో చేర్చాలని కేంద్ర వైద్యారోగ్యశాఖను కోరామని.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మూడు జిల్లాలు మాత్రమే రెడ్ జోన్లు‌గా ఉంటాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

Recommended Video

Pubs, Bars, Clubs And Restaurants Can Sell Liquor, Conditions Applied
కేసుల తీవ్రత దృష్ట్యా..

కేసుల తీవ్రత దృష్ట్యా..

కరోనా వైరస్ గురించి సీఎం కేసీఆర్ ప్రతీరోజు సమీక్షిస్తున్నారు. ఈ నె 15వ తేదీన రివ్యూ నిర్వహిస్తానని కూడా ఇదివరకు తెలియజేశారు. కేసుల తీవ్రతను బట్టి.. హైదరాబాద్‌లో షాపులను ఓపెన్ చేసే అంశంపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఢిల్లీ, చెన్నైలో పరిస్థితిని అంచనా వేసి డిసిషన్ తీసుకుంటామని కేసీఆర్ స్పష్టంచేశారు.

English summary
75 years old person cure for coronavirus telangana health minister etela rajender said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X