తెలంగాణలో మరింత తగ్గుముఖం: 808 కేసులు, ఏడుగురు మృతి
కరోనా కేసులు క్రమంగా తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 1,03,398 కరోనా పరీక్షలు నిర్వహించగా, 808 మందికి కరోనా వచ్చింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 62, ఖమ్మం జిల్లాలో 59, కరీంనగర్ జిల్లాలో 58 కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో 1,061 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు చనిపోయారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు 3,698 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,27,498 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,12,096 మంది కోలుకున్నారు. ఇంకా 11,704 మంది చికిత్స తీసుకుంటున్నారు.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.












Click it and Unblock the Notifications