హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

91,142 కొలువులు.. కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్: అసెంబ్లీలో కేసీఆర్

|
Google Oneindia TeluguNews

నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ తెలిపారు. చెప్పినట్టుగానే ఉదయం 10 గంటలకు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. 95 శాతం లోకల్స్‌కే ఉద్యోగాలు వచ్చేలా చేశామని తెలిపారు. మిగతా 5 శాతంలో కూడా 3 శాతం వరకు మనకే హక్కు ఉంటుందని చెప్పారు. 98 నుంచి 99 శాతం వరకు స్థానికులకు కొలువులు దక్కుతాయని చెప్పారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు 99 శాతం స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. షెడ్యూల్ 9, 10 వివాదం పరిష్కారం అయితే మరిన్ని కొలువులు ఏర్పడనున్నాయి. 20 వేల ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా 91 వేల 142 కొలువులు ఖాళీలు భర్తీ చేస్తాం అని చెప్పారు. తక్షణమే కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. 11 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రకటించారు.

ఇవే కొలువుల..

ఉద్యోగాల్లో గ్రూప్-1, 503, గ్రూపు 2:582, గ్రూప్ 3:1373, గ్రూప్4: 9168 ఉద్యోగాలు ఉంటాయి. జిల్లా స్ధాయిలో 39829, జోనల్ స్థాయిలో;18866, మల్లీజోన్‌లో: 13170 కొలువులు ఉంటాయి. ఇతర కేటగిరి.వర్సిటీలు: 8174, మొత్తం పోస్టులు 80039 భర్తీ చేస్తారు. ఇటు ఆంధ్రా వివాదాలను ఎదుర్కొంటూ.. కేంద్రం వ్యతిరేక వైఖరిని ఎదుర్కొంటూ అన్నిరంగాల్లో అభివృద్ది సాధించామని కేసీఆర్ తెలిపారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తోన్న రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల వివాదం తేలిందని.. కానీ మిగతా విభాగాల పంచాయతీ తేలాల్సి ఉందని చెప్పారు. 1.50 లక్షల నోటిఫై చేసి.. 1.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేశామని చెప్పారు. విద్యుత్ శాఖలో కూడా కొలువులపై వివాదం ఉందని చెప్పారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని.. ఉద్యోగులు అధిక వేతనం ఇస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు 30 శాతం పొల్యూషన్ అలవెన్స్ ఇస్తున్నామని వివరించారు. దేశంలో హోం గార్డులకు ఎక్కువ వేతనం ఇస్తున్నామని చెప్పారు. దేశంలో తక్కువ అప్పులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

నిరుద్యోగుల హర్షం

నిరుద్యోగుల హర్షం


సీఎం కేసీఆర్ ప్రకటనతో నిరుద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంబురాలు చేసుకుంటున్నారు. కేసీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల నినాదంతో ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రం.. ఒక్కొక్క‌టిగా సాకారం చేసుకుంటూ వెళ్తోంది. భారీ ప్రాజెక్టుల‌తో ఇప్ప‌టికే రాష్ట్రంలోని ప్ర‌తి ఎక‌రాకు సాగునీరందించి తెలంగాణ‌ను స‌స్య‌శ్యామ‌లం చేసింది టీఆర్ఎస్ ప్ర‌భుత్వం. కేసీఆర్ మాన‌స పుత్రిక అయిన మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కంతో ప్ర‌తి ఇంటికి సుర‌క్షిత‌మైన తాగునీరును అందించారు.

తలసరి ఆదాయం..

తలసరి ఆదాయం..


ప్ర‌భుత్వానికి వివిధ మార్గాల్లో స‌మ‌కూరుతున్న ఆదాయ వ‌న‌రుల‌ను స‌బ్బండ వ‌ర్గాల అభివృద్ధికి ఖ‌ర్చు చేస్తున్నారు. ఏడేండ్ల‌లో అభివృద్ధిలో దేశానికి ఆద‌ర్శంగా నిలిచి, త‌ల‌స‌రి ఆదాయంలో నంబ‌ర్‌వ‌న్‌గా నిలిచింది. ఇప్ప‌టికే వివిధ శాఖ‌ల్లో ల‌క్ష‌కు పైగా ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టిన తెలంగాణ ప్ర‌భుత్వం.. నేడు భారీ సంఖ్య‌లో ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న చేస్తున్నారు.

English summary
91,142 jobs are fullfilled in the state cm kcr announed at assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X