Hyderabad: అల్లాపూర్ లో దారుణం.. బాలుడిపై వీధి కుక్కల దాడి..!
రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. సంవత్సరం క్రితం అంబర్ పేటలో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా వీధి కుక్కల దాడుల్లో గాయపడడమే కాకుండా చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. రెండు నెలల క్రితం కరీంనగర్ శాతవాహన యూనివర్శిటీ వద్దు ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత కూడా వీధి కుక్కల దాడిలో మనుషులు గాయపడిన ఘటనలు చాలానే జరిగాయి.తాజాగా అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి రాణా ప్రతాప్ నగర్ లో రెండున్నర సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడిని ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్లాయి. స్థానికులు చూసి కుక్కలను తరిమికొట్టారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని నీలోఫర్ హాస్పిటల్ కి తరలించారు.

మరో ఘటనలో కుమారుడిని కుక్క కరిచిందన్న కోపంలో ఓ తండ్రి కుక్కను రాడ్ తో కొట్టి చంపాడు. ఈ ఘటనహైదరాబాద్‌లోని షాహినాయత్‌గంజ్‌లో జరిగింది. వీధి కుక్కపై రాడ్ తో దాడి చేయడమే కాకుండా రెండంతస్తుల భవనంపై నుంచి కిందికి తోసేశాడు. దీంతో అది మృతి చెందింది. ఉప్పలమ్మ దేవాలయం సమీపంలోని దేవెనగర్ ప్రాంతంలో నవంబర్ 2న శనివారం ఈ ఘటన జరిగింది.
సత్యనారాయణ అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆ సమయంలో వారు బాణాసంచా కాల్చారు. ఈ బాణసంచా మెరుగులు సమీపంలోని కుక్కను భయపెట్టింది. దీనివల్ల అది బాధతో పారిపోయింది. కొంతసేపటికి కుక్క తిరిగి వచ్చి సత్యనారాయణ కుమారుడిని కరిచింది. దీంతో ఆవేశంతో సత్యనారాయణ కుక్కపై రాడ్ తో దాడి చేశాడు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అతను ఆగలేదు. ఈ దారుణ ఘటనపై షాహినాయత్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications