StreetStreet Dogs: కూకట్‍పల్లిలో దార Dogs: కూకట్‍పల్లిలో దారుణం.. వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు..
హైదరాబాద్ లో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. కూకట్ పల్లిల్లో ఓ బాలిడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఇంటి వద్ద ఆడుకుంటున్న మయాంక్ అనే కుర్రాడిపై వీధి కుక్కలు అటాక్ చేశాయి. బాలుడి అరుపులు విన్న చుట్టపక్కల వారు కుక్కలను వెళ్లగొట్టాయి. అయితే అప్పటికే కుక్కలు మయాంక్ ను తీవ్రంగా గాయపరిచాడి. మయాంక్ చెంప, దవడకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ లో వీధి కుక్కల దాడులు కామన్ అయిపోయాయి.
కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధి కుక్కలు ఓ బాలుడి పై దాడి చేసి చంపాయి. ఈ ఘటన అప్పట్లో కలకలం సృష్టించింది. కుక్కలు బాలుడిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత వీధి కుక్కలను అదుపు చేయాలని భారీగా ఫిర్యాదులు అందాయి. అయినా కూడా అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించడంతో వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయి.

హైదరాబాద్ ఘటన తర్వాత కాజీపేటలో ఓ బాలుడిని వీధి కుక్కలు కరిచి చంపాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సునీత, మల్కాన్ దంపతులు అజ్మీర్ వెళ్లేందుకు తమ కుమారుడు చోటూతో కాజీపేట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. చోటూ బహిర్భూమి కోసం పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లాడు. అక్కడే ఉన్న ఆరు వీధి కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు మృతి చెందాడు. ఆ తర్వాత కూడా వీధి కుక్కల దాడుల ఘటనలు చాలానే జరిగాయి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురం వెంకయ్య తండా, మేఘ్య తండాలలో 14 మందిపై వీధి కుక్కల దాడి చేశాయి. గాయపడ్డ వారిలో కొందరు మహిళలు, కొందరు చిన్నపిల్లలు ఉన్నారు. కుక్క కాటుకు గురైన వారందరికి చికిత్స కోసం మరిపెడ పీహెచ్ సీకి తీసుకెళ్లారు. మెదక్ జిల్లాలో ఓ ఏడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇలా నిత్యం ఏదో ఓ చోట వీధి కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications