ఇంట్లో ఒంటరిగా ఉన్న బీటెక్ యువతి.. ఓ వ్యక్తి వచ్చి వెళ్లగానే విగతజీవిగా మారింది
హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. చందానగర్ పరిధిలో ఓ బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి దూబేకాలనీకి చెందినర వెంకటచారి హెచ్‌సీయూలో కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. కరోనాతో ఏడాదిన్నర క్రితం ఆయన మృతి చెందాడు.

ఇంట్లో ఒంటరిగా బీటెక్ యువతి..
వెంకటచారికి భార్య ఉమారాణి, ఇద్దరు కుమార్తులు ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లై మొయినాబాద్‌లో ఉంటోంది. చిన్న కుమార్తె సౌజన్య(22) బాచుపల్లి డీఆర్కే కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. ఫిబ్రవరి 18న పెద్ద కుమార్తె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లి మొయినాబాద్‌కు వెళ్లింది. దీంతో సౌజన్య ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలోనే ఓ వ్యక్తి వచ్చాడు. కాసేపటి తర్వాత సౌజన్య పిచ్చి పిచ్చిగా అరుస్తోంది.. వైద్యుడిని తీసుకొస్తానని ఇంటిపైన అద్దెకుంటున్నవారికి చెప్పి బయటికి వెళ్లాడు.

విజయ్ వచ్చి వెళ్లగానే.. సౌజన్య మృతి
వెంటనే అద్దెకున్నవారు సౌజన్య ఇంటికి వెళ్లి చూడగా.. ఆమె కిందపడిపోయి ఉంది. వెంటనే డాక్టర్‌ను పిలిపించి పరీక్ష చేయించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. ఈ విషయాన్ని తల్లికి చెప్పగా.. ఆమె తిరిగి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, సౌజన్య ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిందని విజయ్ అనే వ్యక్తి అని సీసీ కెమెరాల పరిశీలనలో వెల్లడైంది. ఇతడు స్థానికంగా జీటీజీ ఇన్ఫోటిక్ సొల్యూషన్స్ అనే సంస్థ నిర్వహిస్తున్నాడు. కాగా, 8 నెలల క్రితం సౌజన్య అక్కడే పనిచేసింది.

సౌజన్యను వేధిస్తున్న విజయ్..
కాలేజీకి వెళ్లాలని ఉద్యోగం మానేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సౌజన్య మృతిపై తమకు అనుమానాలున్నాయని పోలీసులకు ఆమె తల్లి తెలిపింది. ఆ రోజు సాయంత్రం విజయ్ రెండుసార్లు వచ్చి వెళ్లాడు, ఉరేసుకున్నట్లు చిత్రీకరించడానికి చీరను కత్తితో కత్తిరించినట్లు ఆనవాళ్లున్నాయి. గతంలో కూడా విజయ్.. సౌజన్య వేధించాడు. ఇది ముమ్మాటికీ హత్య. ఘటన జరిగిన తర్వాత విజయ్ స్థానికంగానే తిరుగుతున్నా.. పోలీసులు చర్యలు తీసుకోలేదు. మాపైనే దురుసుగా మాట్లాడుతున్నారు అని సౌజన్య కుటుంబసభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, విజయ్ ఇంటికి తాళం వేసి ఉందని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Recommended Video

యువతికి పురుగుల మందు తాగించిన ప్రేమోన్మాది
ఇది ఇలావుండగా, వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. దశ్రు తండాలో రాజేందర్ అనే యువకుడు తాను ప్రేమించిన యువతికి పురుగులమందు తాగించి తానూ తాగాడు. తనను పెళ్లి చేసుకోలేదని కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ రాజేందర్ మృతి చెందాడు. ప్రస్తుతం బాధిత యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజేందర్ ములుగు మండలం చింతకుంట వాసి అని తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications