విషాదం: జేఎన్టీయూ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని జేఎన్టీయూ క్యాంపస్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. సీఎస్ఈ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బుధవారం క్లాస్‌రూం కాంప్లెక్స్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తమ విద్యార్థినిగా కొనసాగుతున్న ఆమె ఆత్మహత్యకు పాల్పడటంతో క్యాంపస్‌లో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కొడవలూరుకు చెందిన ఇసానక మనోజ్ కుమార్ రెడ్డి.. తన భార్య, కుమార్తె మేఘనా రెడ్డి(21)తో కలిసి హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి వివేకానంద్ నగర్‌లో ఉంటున్నారు. కాగా, బుధవారం ఉదయం ఇంటర్నల్ పరీక్ష రాసిన మేఘన మధ్యాహ్నం 2 గంటలకు చివరి ఏడాది సెమిస్టర్ పరీక్ష రాయాల్సి ఉంది.

అయితే, ఇందుకు పావుగంట ముందు అంటే 1.45 గంటల ప్రాంతంలో క్యాంపస్‌లో మైదానం పక్కన నాలుగు అంతస్తుల భవనంపైకి వెళ్లి దూకేసింది. ఆమెను వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో మృతి చెందింది. తోటి విద్యార్థులు, అధ్యాపకులు కన్నీటిపర్యంతమయ్యారు. బతికించుకునేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని సీఎస్ఈ హెడ్ వసుమతి కన్నీళ్లుపెట్టుకున్నారు. మేఘన తరగతిలోనూ ముభావంగా ఉండేదని, తనకు ఐఐటీలో చదవాలని ఉండేదని తోటి విద్యార్థులు తెలిపారు.
కాగా, మేఘన ఎంసెట్ 200 ర్యాంక్ సాధించడం గమనార్హం. ఏడాది కాలంగా మానసిక చికిత్స తీసుకుంటోందని వైస్ ప్రిన్సిపల్ నర్సింహారెడ్డి తెలిపారు. ఆరు నెలలుగా కుమార్తెను తల్లి కారులో తీసుకొచ్చి వర్సిటీలో దింపి.. తరగతులు ముగిసే వరకు ఇక్కడే ఉండి తిరిగి తీసుకెళ్లేదని విద్యార్థులు తెలిపారు. బుధవారం 1.40 వరకు కుమార్తెతోనే ఉండి.. అన్నం తినిపించింది తల్లి. ఆ తర్వాత పరీక్ష బాగా రాసి రా అని చెప్పి అటుగా వెళ్లగానే మొదటి సంవత్సరం తరగతులు జరిగే భవనంపైకి వెళ్లిన మేఘన.. అక్కడ్నుంచి దూకేసింది. కాగా, కాగా, ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఎస్‌హెచ్ఓ కిషన్ కుమార్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications