హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాక్‌డౌన్..ఫస్ట్రేషన్: పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన హైదరాబాదీ: నా తడాఖా చూస్తావా అంటూ వీరంగం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లాక్‌డౌన్ డ్యూటీల్లో ఉన్న పోలీసులపై విరుచుకుపడ్డాడో హైదరాబాదీ. సాదాసీదాగా కాదు.. యథేచ్ఛగా రెచ్చిపోయాడు. ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. బూతు మాటలతో వీరంగం సృష్టించాడు. నా తడాఖా చూస్తావా? పోలీస్ స్టేషన్‌ను లేపేస్తానంటూ ఆగ్రహావేశాలను ప్రదర్శించాడు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ సమీపంలో చోటు చేసుకుంది ఈ ఘటన. అనంతరం అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు.

లంగర్‌హౌస్ సమీపంలోని బాపూఘాట్ వద్ద పోలీసులు విధి నిర్వహణలో ఉన్న సమయంలో అటుగా బైక్‌పై దూసుకొచ్చాడో వ్యక్తి. లాక్‌డౌన్ డ్యూటీలో ఉన్న పోలీసులు అతణ్ని అడ్డుకున్నారు. బైక్ తాళాలను లాక్కున్నారు. అంతే. తన నోటికి పని చెప్పాడా వ్యక్తి. తన ఎదురుగా ఉన్నది విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అనే విషయాన్ని కూడా విస్మరించినట్టున్నాడు. వారిపై పరుష పదజాలాన్ని ప్రయోగించాడు. బూతులు తిడుతూ దూసుకెళ్లాడు.

A man arrest at Langer House in Hyderabad for breaking the lockdown norms

రాయడానికి వీల్లేని పదజాలంతో దూషించాడు. అతని దూకుడుకు పోలీసుల వద్ద సమాధానమే లేకుండా పోయిందంటే.. అతను ఏ స్థాయిలో రెచ్చిపోయాడో అర్థం చేసుకోవచ్చు. సంఘటనా స్థలంలో నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నప్పటికీ.. అతణ్ని అడ్డుకోలేకపోయారు. తొలుత అతను మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు భావించారు. కొద్దిసేపటికే అతను మద్యం సేవించలేదనే విషయాన్ని నిర్దారించుకున్నారు. ఆ వ్యక్తి ఓ దశలో పోలీసులు ధరించిన మాస్క్‌ను కూడా లాగడానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Recommended Video

Baby gets Surprise Birthday Cake from Hyderabad Police ahead of Parents’ Request From US

అతను తమపై దౌర్జన్యం చేస్తున్నాడనే సమాచారాన్ని లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌కు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి చర్యల కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

English summary
A man arrested at Langar House in Hyderabad for abusing the Police, who have in Lockdown duties. The same person taken in to the custody by the Police. Later case filed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X