షాకింగ్: మర్మాంగం కోసుకుని.. గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థి బలవన్మరణం
హైదరాబాద్: ఓ విద్యార్థి దిగ్భ్రాంతికర నిర్ణయం తీసుకున్నాడు. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దీక్షిత్ రెడ్డి(21) అనే యువకుడు తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లా దేవరుప్పల గ్రామానికి చెందిన సోమిరెడ్డి, కరుణ దంపతులు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ శివారు పాపిరెడ్డినగర్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు దీక్షిత్ రెడ్డి ఉన్నారు. మానసిక స్థితి సరికా లేకపోవడంతో గతంలో దీక్షిత్ రెడ్డి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఈ క్రమంలో అతడికి వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే, తరచూ మందులు తినాల్సి వస్తుందని మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలోనే తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబసభ్యులు ఆదివారం బయటికి వెళ్లిన సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆదివారం సాయంత్రం 5 గంటలకు తిరిగి రాగా.. ఇంట్లో ఉన్న దీక్షిత్ రెడ్డి ఎంతకీ తలుపు తీయలేదు. కిటికీలోంచి చూడగా రక్తపు మడుగులో కనిపించాడు. వెంటనే కుటుంబసభ్యులు 108 సిబ్బందికి ఫోన్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి చూసేసరికి మర్మాంగం కోసుకుని అప్పటికే దీక్షిత్ మృతి చెందాడని గుర్తించారు. దీక్షిత్ రెడ్డి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ఇలావుండగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐఐటీ ఢిల్లీలో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన ఆయుష్ అష్నా(20) అనే విద్యార్థి ఐఐటీ ఢిల్లీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి ఆ విద్యార్థి క్యాంపస్‌లోని ఉదయగిరి హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం శోచనీయం.












Click it and Unblock the Notifications