Cable Bridge: దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి.. 2 రోజుల తర్వాత లభ్యమైన మృతదేహం..

గత శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వెంకట నరసింహారెడ్డిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ తరలించారు.

పోలీసులు ఆత్మహత్యకు గల కారణాల పై దర్యాప్తు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి బ్రిడ్జిపై నుంచి దూకుతున్న సమయంలో కొంత మంది వాహనదారులు చూశారు. అతన్ని ఆపే ప్రయత్నం చేసే లోపే.. అతను చెరువులోకి దూకేశాడు.

A person who committed suicide by jumping into the Durgam Cheruvu Cable Bridge on Saturday

వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థిలికి చేరుకున్న పోలీసులు చెరువులో దూకిన వ్యక్తి కోసం గజ ఈతగాళ్లు, బోట్ల సాయంతో వెతికారు. రెండు రోజుల అనంతరం అతని మృతదేహాన్ని వెలికితీశారు. కొన్ని రోజుల క్రితం ఓ మహిళ సైతం ఇలాగే బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గతేడాది సెప్టెంబర్ ఓ మహిళ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ కు చెందిన స్వప్న దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యయత్నం చేసుకుంది. అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. కేబుల్‌ బ్రిడ్డి వద్ద స్వప్నకు సంబంధించిన హ్యాండ్‌ ఆధారంగా ఆమె ఆధారాలు పోలీసులు సేకరించారు. యువతి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, డిప్రెషన్ కు లోను కావడంతోనే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్థారించారు. భర్తతో విడాకులు తీసుకొని 6 నెలలుగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

స్వప్న 2022 సెప్టెంబర్ 28 చెరువులోకి దూకగా.. ఆమె మృతదేహం ఆచూకీ సెప్టెంబర్ 30 తేదీన లభ్యమైంది. చెరువులో బురద ఎక్కువగా ఉండడంతో డెడ్ బాడీ వెతకడం కష్టంగా మారింది. నరసింహారెడ్డి మృతదేహం దొరకడం కష్టమైంది. రెండు గాలించగా.. సోమవారం డెడ్ బాడీ బయటకు తీశారు. ట్యాంక్ బండ్ వద్ద లేక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లుగానే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద కూడా పోలీసులను కాపలా పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+