హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య: వెంటాడి వేటాడి చంపారు

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో శుక్రవారం దారుణ హత్య జరిగింది. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ మొహమ్మద్ జబేర్‌ను కొందరు దుండగులు హత్య చేశారు. కత్తులతో వెంటాడివేటాడి నడిరోడ్డుపై ప్రాణం తీశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తఫానగర్‌లో కాలాపత్తర్ రౌడీషీటర్ మొహమ్మద్ జబేర్ నివాసం ఉంటున్నాడు. కాగా, శుక్రవారం సాయంత్రం జబేర్‌ను ఫలక్‌నుమా అన్సారీ రోడ్‌లో కొంతమంది దుండగులు కత్తులతో వెంటాడారు. ఆ తర్వాత అతడిపై దాడి చేసి విచక్షణారహితంగా మారణాయుధాలతో పొడిచి చంపారు.

A rowdy sheeter killed in hyderabad old city

ఈ ఘటన స్థానంగా కలకలం రేపింది. కళ్లముందే దారుణ ఘటన జరుగుతున్నా ఏమీ చేయలేకపోయారు. దుండుగులు పరారైన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జబేర్ ను ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు ప్రాణాలు వదిలాడు. దీంతో పోస్టుమార్టంకు అతని మృతదేహాన్ని తరలించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ జోన్ డీసీపీ గజారావు భూపాలు, క్లూస్ టీం అక్కడి ప్రాంతాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కాగా, త జులైలో కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శానుర్ ఖాజీ అనే వ్యక్తి హత్య కేసులో జబేర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్య నేపథ్యంలోనే శానుర్ ఖాజీ అనుచరులు జబేర్ ను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+