విషాదం: గెస్ట్‌హౌస్‌లో అనుమానాస్పదస్థితిలో కాగ్నిజెంట్ టెక్కీ మృతి

హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ మౌలాలి హెచ్‌బీ కాలనీకి చెందిన శ్రీకాంత్(49) బెంగళూరులోని కాగ్నజెంట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

2007లో వివాహమైన మూడు నెలలకే అతను మధుమేహంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న భార్య అతడిని వదిలి వెళ్లిపోయింది. అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటున్న శ్రీకాంత్ మద్యానికి బానిసయ్యాడు. అక్టోబర్ 3న నగరానికి వచ్చిన శ్రీకాంత్ డైమండ్ పాయింట్ చౌరస్తాలోని అతిథి గెస్ట్ హౌస్‌లో ఉంటున్నాడు. కాగా, ఇతనికి బంధువైన శ్రీనివాస్ భోజనం తెస్తుంటారు. రోజులాగే శ్రీనివాస్ శనివారం మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చాడు.

A software engineer suspiciously died in hyderabad.

ఎంత తట్టినా శ్రీకాంత్ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి నిర్వాహకులు విషయం చెప్పాడు. వారు వచ్చి తలుపులు తెరిచి చూసేసరికి శ్రీకాంత్ అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. 108 సిబ్బంది శ్రీకాంత్‌ను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శ్రీకాంత్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని తమ్ముడు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

Recommended Video

    Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu

    విద్యుత్ షాక్ తో ఓ మహిళా రైతు మృతి చెందింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం మహ్మద్‌నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవల భూదేవ్వ(48) రోజు మాదిరిగానే శనివారం పొలానికి నీరు పారించేందుకు వెళ్లింది. సాంయత్రమైన తిరిగి రాకపోయేసరికి కుమారుడు వెళ్లి చూడగా.. బోరు భావి దగ్గర విగతజీవిగా పడివుంది భూదేవ్వ. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మోటారు ఆన్ చేసే సమయంలో విద్యుత్ షాక్ తగిలి మహిళా రైతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+