కరోనాను ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చరు: కేసీఆర్ సర్కార్‌పై బండి సంజయ్ ధ్వజం
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలోనూ ప్రజలకు కనిపించలేదన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ బారత్‌ను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రశ్నించారు. లాక్ డౌన్ సమయంలోనూ ప్రాజెక్టులకు టెండర్లు ఎందుకు పిలిచారని నిలదీశారు. సెక్రటేరియట్ వ్యర్థాల తరలింపు కోసం రూ.15 కోట్లు కేటాయించారని చెప్పారు. ఈ సమయంలో సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఏముందని అడిగారు. ఆ 15 కోట్లతో పేదలకు కరోనా వైరస్ చికిత్స చేయించొచ్చు కదా అన్నారు. గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో రోగులకు అందుతోన్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఆరోగ్య శ్రీలో చేర్చారని బండి సంజయ్ గుర్తుచేశారు. మరీ ఇక్కడ ఎందుకు చేర్చడం లేదన్నారు. పేదలు, మధ్య తరగతి వారు లక్షలకు లక్షలు పెట్టి కార్పొరేట్ ఆస్పత్రిలో ఎలా వైద్యం చేయించుకుంటారని అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సచివాలయం నిర్మాణంపై కేసులు ఉన్న నిర్మాణాలపై ప్రభుత్వం ముందడుగు వేయడం బాధాకరమన్నారు.

ఉస్మానియాను పునర్ నిర్మిస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారని ధ్వజమెత్తారు. కరోనా వైరస్ సందర్భంగా పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. కానీ ముఖ్యమంత్రే కనిపించరు.. ఇక పేదల సాధక బాధకాలను పట్టించుకునేది ఎవరు అని సెటైర్లు వేశారు. ఉస్మానియా ఔట్ సోర్సింగ్ నర్సులు, పారిశుద్ద కార్మికులు బండి సంజయ్‌ని కలిసి తమ సమస్యలను విన్నవించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications