హైదరాబాదీలకు గుడ్‌న్యూస్: అదనంగ 20 ఎంఎంటీఎస్ రైళ్లు, గమ్యస్థానాల పొడిగింపు

హైదరాబాద్: జంట నగరాల ప్రజలకు ఎంఎంటీఎస్ శుభవార్త అందించింది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల ప్రజల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీస్ సేవలను మరింతగా పెంచింది. రైళ్లను పెంచడంతోపాటు నగర పరసర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం వాటి గమ్యస్థానాలను పొడిగించింది.

సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు వెళ్లేందుకు 20 ఎంఎంటీఎస్ రైళ్లను అదనంగా కేటాయించింది. ఇక లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్‌నుమా వెళ్లే ఎంఎంటీఎస్ రైళ్లను ఉందానగర్ రైల్వే స్టేషన్ వరకు పొడిగించింది. దీంతో జంట నగరాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య 106కు చేరింది. సికింద్రాబాద్-మేడ్చల్ మార్గంలో జంట నగరాల నుంచి ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుండటంతో ఈ 20 అదనపు రైళ్లను కేటాయించింది దక్షిణ మధ్య రైల్వే.

Additional mmts services from secunderabad

47231, 47222, 47233, 47224, 47235, 47226, 47237, 47228, 47239, 47230 నెంబర్లు కలిగిన 10 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను మేడ్చల్ నుంచి సికింద్రాబాద్‌కి వచ్చేందుకు కేటాయించగా.. 47221, 47232, 47223, 47234, 47225, 47236, 47227, 47238, 47229, 47240 నెంబర్లు కలిగిన
మరో 10 ఎమ్‌ఎమ్‌టీఎస్ రైళ్లను సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లేందుకు అదనంగా జోడించింది.

Additional mmts services from secunderabad

జంటనగరాల విస్తీర్ణం పెరగడం, ఇక్కడను నిత్యం రాకపోకలు జరిపేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. లింగంపల్లి-ఫలక్‌నూమా మార్గంలో నడిచే రైళ్లను ఉందానగర్‌ వరకు పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. 47213, 47173, 47176, 47178, 47212, 47181, 47210, 47190, 47159, 47194 నెంబర్లు కలిగిన ఎం‌ంమ్‌టీఎస్ రైళ్లను లింగంపల్లి నుంచి సికింద్రాబాద్, ఫలక్‌నూమా ప్రాంతాల మీదుగా ఉందానగర్ వరకూ నడపనుంది. 47151, 47153, 47154, 47211, 47165, 47157, 47214, 47160, 47164, 47203 నంబర్ల ఎం‌ఎంటీఎస్ రైళ్లను ఫలక్‌నూమా నుంచి కాకుండా ఉందానగర్ నుంచి లింగంపల్లికి వచ్చేలా ఏర్పాట్లు చేసింది. దీంతో నగర శివారు ప్రజలకు కూడా ఎంఎంటీఎస్ మరింత అందుబాటులో ఉండనుంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+