హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీకి బిగ్ షాక్: టీఆర్ఎస్‌లో చేరిన నలుగురు కార్పొరేటర్లు, తాండూర్ బీజేపీ ప్లోర్ లీడర్ కూడా

|
Google Oneindia TeluguNews

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఆ పార్టీ శ్రేణులు మంచి జోష్ మీద ఉన్నారు. పార్టీకి మంచి ఊపు తీసుకొద్దామని అనుకున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పెద్ద షాక్ ఇచ్చారు. బీజేపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు షాక్ ఇచ్చారు.

బీజేపీకి షాక్

బీజేపీకి షాక్

తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడ‌ర్‌ సింధూజ జేపీని వీడి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఆమెతో క‌లిసి బీజేపీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాతనాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చనప్రకాశ్‌, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేశ్‌, అడిక్‌మెట్‌ కార్పొరేటర్ సునీత‌ప్రకాశ్‌గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజగౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు క‌ప్పారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, పైలెట్ రోహిత్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.

 మోడీ మీట్.. అంతలోనే

మోడీ మీట్.. అంతలోనే


ఇటీవల జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.మరో 24 గంటల్లో జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద‌రాబాద్ వస్తున్నారు. ఆ పార్టీకి చెందిన‌ కార్పొరేట‌ర్లు, నాయ‌కులు టీఆర్ఎస్‌లో చేర‌డంతో బీజేపీ ముఖ్య నేత‌లు షాక్‌కు గుర‌య్యారు.

 రెండు రోజుల ముందు

రెండు రోజుల ముందు


జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. సమావేశాలకు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు సహా ప్రధాని మోడీ హాజరవుతున్నారు. నోవాటెల్‌ హోటల్‌లో సమావేశాలు జరగనుండగా.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అక్కడే బస చేస్తారు.

English summary
big shock to bjp: ahead of national executive meeting 4 bjp corporators joined to trs party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X