ఆర్టీసీ బస్సులో అలారం, సీసీ కెమెరా.. యాక్సిడెంట్ అవబోతుంటే ట్రేస్..
ఇప్పుడు ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ మొత్తం మారిపోతోంది. ఒకప్పటి లాగా లేదు. కార్లలో అయితే జీపీఆర్ఎస్ కూడా ఉంటుంది. గూగుల్ మ్యాప్ ద్వారా లోకేషన్ ఈజీగా తెలిసిపోతుంది. ఇక బస్సులలో కూడా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబోతున్నారు. అదీ తెలంగాణ ఆర్టీసీలో.. కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.
'ఐరాస్తే' కార్యక్రమంలో భాగంగా కొన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, అలారం ఏర్పాటు చేయబోతుంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ఇంటెల్, ఐఎన్ఏఐ, టీఎస్ ఆర్టీసీ కలిపి ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేశారు. డ్రైవర్ క్యాబిన్‌లో అలారం, సెన్సర్, మూడు కెమెరాలు ఉంటాయి. ఏదైనా వాహనాన్ని ఢీకొనే పరిస్థితి వస్తే ఇవి హెచ్చరిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏడీఏఎస్ టెక్నాలజీ ద్వారా.. కెమెరా గ్రహించే దృశ్యాల్ని విశ్లేషించి, అలారం పని చేస్తుంది.

ఆ కెమెరాల ఆధారంగా సెంట్రల్ సర్వర్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. సికింద్రాబాద్ డిపో నుంచి హైవేలపై ప్రయాణించే 12 బస్సులలో ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేశారు. రెండు నెలల్లో 200కు పైగా బస్సుల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కో బస్సులో ఈ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు మూడు గంటల సమయం పడుతుందట.
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మార్పులు జరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాలకు కూడా సర్వీసు అందజేస్తున్నారు. ఒక ట్వీట్ చేస్తే చాలు వెంటనే స్పందించి మరీ చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే పలు సమస్యలను పరిష్కరించారు.












Click it and Unblock the Notifications