హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

10 లక్షల మందికి వ్యాక్సిన్.. అమెజాన్ ఇండియా గొప్ప మనసు.. ఎవరికి అంటే

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వ్యాక్సిన్ వైపు జనం చూస్తున్నారు. 45 సంవత్సరాలు ఏజ్ లిమిట్ పెట్టడంతో మిగతా వారు పక్కచూపులు చూస్తున్నారు. అయితే కార్పొరేట్ కంపెనీలు తమ సిబ్బంది, వారి కుటుంబంపై కూడా దృష్టిసారించాయి. అమెజాన్ ఇండియా కూడా అదేవిధంగా వ్యవహరిస్తోంది. ఏకంగా 10 లక్షల మంది సిబ్బందికి వ్యాక్సిన్ అందజేయబోతోంది. తమ స్టాఫ్ ఆరోగ్యం ముక్యం అని ఇండికేషన్ ఇచ్చింది.

దేశంలో 45 ఏళ్ల దాటిన వారికి వ్యక్తులకు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే అమెజాన్‌ ఇండియా ఉద్యోగులు, అసోసియేట్లు, విక్రేతలతోపాటు భాగస్వాములను వ్యాక్సిన్‌ వేయించే పనిలో ఉంది. వారితోపాటు కుటుంబ సభ్యులు, కమ్యూనిటీ కాపాడుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తుంది. అమెజాన్‌ ఇండియా ఇప్పుడు కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ ఖర్చును కేవలం తమ భారతీయ ఉద్యోగులు మరియు అసొసియేట్లకు మాత్రమే కాదు, అమెజాన్‌ ఫ్లెక్స్‌ డ్రైవర్లు, ఐ హ్యావ్‌ స్పేస్‌ (ఐహెచ్‌ఎస్‌) స్టోర్‌ భాగస్వాములు, ట్రాకింగ్‌ భాగస్వాములు మరియు వారి అర్హత కలిగిన డిపెండండ్లు సహా డెలివరీ సర్వీస్‌ పార్టనర్‌ అసోసియేట్స్‌ నెట్‌వర్క్‌ భాగస్వాములకు సహా ఖర్చును అమెజాన్‌ ఇండియా భరించనుంది.

amazon india to give above 10 lakh corona vaccines

గత సంవత్సర కాలంగా చురుగ్గా అమెజాన్‌ డాట్‌ ఇన్‌పై లిస్టింగ్‌ చేయబడ్డ విక్రేతలకు సైతం ఈ ప్రయోజాలను అందజేయనున్నట్లు అమెజాన్‌ ఇండియా వెల్లడించింది. కోవిడ్‌ చికిత్స కోసం అయ్యే ఖర్చును అమెజాన్‌ ఇండియా అందించడంతోపాటు హాస్పిటల్‌ సెర్చ్‌, నిర్ధేశిత కోవిడ్‌-19 పరీక్షల కవరేజీ సైతం అందిస్తుంది. తమ సిబ్బంది పట్ల కంపెనీ చూపుతోన్న శ్రద్దపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary
amazon india to give above 10 lakh corona vaccines company staff and officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X