మిర్చి బజ్జీలు తినేందుకు సైరన్‌తో వచ్చిన అంబులెన్స్ డ్రైవర్: డీజీపీ సీరియస్ వార్నింగ్
హైదరాబాద్: ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగించాల్సిన అంబులెన్స్ వాహనాన్ని కొందరు డ్రైవర్లు దుర్వినియోగం చేస్తున్నారు. పేషెంట్లు లేకపోయినా.. తమ అవసరాల కోసం వెళతు కూడా సైరెన్లను మోగిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ నగరంలో ఓ అంబులెన్స్ డ్రైవర్ నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కూడా ఈ విషయం ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు.
ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ డ్రైవర్ సైరన్ వేసుకుని ట్రాఫిక్‌లో వేగంగా వెళుతున్నాడు. గమనించిన ట్రాఫిక్ పోలీసులు..ఎమర్జెన్సీ ఏమైనా ఉందోనని ట్రాఫిక్ పోలీస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి మరీ ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీంతో అంబులెన్స్ అక్కడ్నుంచి సాఫీగా వెళ్లిపోయింది. అయితే, ఆ తర్వాత అంబులెన్స్ డ్రైవర్ చేసిన పని అందరికీ తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చిన అంబులెన్స్.. రోడ్డు పక్కన ఉన్న మిర్చి బండి వద్ద ఆగింది. ఆ తర్వాత అంబులెన్స్ నుంచి దిగిన డ్రైవర్ తాపీగా మిర్చి బజ్జీలు తిని, కూల్ డ్రింక్స్ తాగాడు. ఏదో ఎమర్జెన్సీ ఉందని ట్రాపిక్ క్లియర్ చేసి పంపిస్తే.. ఇలా తాపీగా బజ్జీలు తింటూ, శీతలపానీయాలు తాగుతున్న డ్రైవర్‌ను చూసి పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. డ్రైవర్‌ను ఈ విషయం అడగ్గా కుంటిసాకులు చెప్పాడు. దీంతో ఈ తతంగమంతా వీడియో తీసి అధికారులకు పంపించారు.
#TelanganaPolice urges responsible use of ambulance services, citing misuse of sirens. Genuine emergencies require activating sirens for swift and safe passage. Strict action against abusers is advised.
— Anjani Kumar IPS (@Anjanikumar_IPS) July 11, 2023
Together, we can enhance emergency response and community safety. pic.twitter.com/TuRkMeQ3zN
ఈ వీడియో చూసిన డీజీపీ అంజనీ కుమార్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ డ్రైవర్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్టు చేసిన డీజీపీ.. ఎమర్జెన్సీ ఉంటేనే అంబులెన్స్ సైరన్ మోగించాలన్నారు.పేషెంట్లు లేనప్పుడు, సొంత పనుల కోసం వెళుతున్నప్పడు సైరన్ మోగించవద్దన్నారు. అంబులెన్స్ సైరన్ ఇష్టవచ్చినట్లు వాడితే కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేగాక, ఈ ఘటనకు సంబంధించి చర్యలు తీసుకుంటామన్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications