• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బండ బూతులు - గాంధీ భవన్‌లో గలాటా - గ్రేటర్ ఎన్నికల వ్యూహంపై చర్చలో రచ్చరచ్చ

|

అంతర్గత ప్రజాస్వామ్యానికి కేరాఫ్‌గా ఉండే కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో మంగళవారం గాంధీ భవన్‌లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. వాగ్వాదానికి దిగిన నేతలు.. బండబూతులు తిట్టుకుంటూ ఒక దశలో కొట్లాటకు సైతం సిద్ధపడ్డారు. చివరికి ఉత్తమ్ సముదాయింపుతో వివాదం తాత్కాలికంగా సర్దుమణిగింది.

Telangana Liberation day:నిజాం రజాకార్ల నిరంకుశ పాలన నుంచి విముక్తి ఎలా కలిగింది..?

చైనా మరో దురాగతం: ఇనుప రాడ్లు, బరిసెలతో భారత్ శిబిరంపై దాడికి - ముఖ్పారి పర్వతంపై ఘటన

ఇంకొద్ది నెలల్లో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు పీసీసీ చీఫ్ సమావేశం ఏర్పాటు చేయగా, సీనియర్ నేతలైన దాసోజు శ్రవణ్, టి.నిరంజన్ మధ్య మాటల యుద్ధం తలెత్తింది. హైదరాబాద్ లోని ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎలాంటి ప్రణాలికలు సిద్ధం చేశారో చెప్పాలని ఉత్తమ్ నేతలను అడిగే క్రమంలో.. దాసోజు శ్రవణ్ వివరణ కోరేందుకు ప్రయత్నించారు...

 amid GHMC Elections preparations, tpcc leaders aggression in Gandhi Bhavan

ముందు పీసీసీ ఏం చెబుతుందో వినాలంటూ దాసోజు శ్రవణ్‌ను నిరంజన్ హెచ్చరించడంతో గొడవ మొదలైంది. తాను పార్టీ చీఫ్ ను అడుగుతుంటే, మధ్యలో జోక్యమెందుకంటూ నిరంజన్ పై దాసోజు మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతల మధ్య మాటా మాటా పెరిగి, అసభ్య పదజాలం దాకా వెళ్లింది. ఒక దశలో లేచి కొట్టుకోడానికి సిద్ధమయ్యారు. అంతలోనే ఉత్తమ్ జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేశారు. నిజానికి..

అడ్డంగా దొరికిన చైనా - కిడ్నాపైన భారతీయులు డ్రాగన్ చెరలోనే - విడుదలపై కేంద్ర మంత్రి ప్రకటన

గొడవకు ముందు గాంధీ భవన్ లో సందడి వాతావరణం కనిపించింది. మంగళవారం దాసోజు శ్రవణ్‌ పుట్టినరోజు కావడంతో నేతలందరూ ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ సరదాగా గడిపారు. తీరా మీటింగ్ లో మాత్రం తిట్లపరంపర చోటుచేసుకుంది. దాసోజు, నిరంజన్ ల గలాటాపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విశ్వేశ్వర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో పద్ధతి, ప్రోటోకాల్ లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

English summary
once again Gandhi Bhavan witnesses to the aggression of leaders. when Telangana Congress Leaders sat to discuss on GHMC Elections strategy, some leaders exchanged War of Words. senior leader dasoju sravan and niranjan quarrel each other
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X