కొత్త ఏడాది పేరుతో కుమ్మేశారు -తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు -ఎంతంటే..
కరోనా విలయ కాలంలో దాదాపు అన్నీ రంగాలూ స్తంభించిపోయినా, మద్యం అమ్మకాలు మాత్రమే ప్రభుత్వాలకు ఏకైక ఆదాయమార్గంగా ఉంటూ వచ్చాయి. అన్ లాక్ ప్రక్రియలో ముందుగా తెరుచుకున్నవి కూడా వైన్ షాపులేనని తెలిసిందే. గతేడాది కరోనా కారణంగా న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేనప్పటికీ జనం ఇళ్లలోనే కూర్చొని మందు కుమ్మేశారు. తెలంగాణలోనైతే మద్యం అమ్మకాలు కొత్త రికార్డులను తాకింది..
2021 కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతూపే తెలంగా రాష్ట్రం మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టించింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వందల కోట్ల లిక్కర్ బిజినెస్ నడిచింది. డిసెంబర్ 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.758.76 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్ర అబ్కారీశాఖ ఈ మేరకు ఒక ప్రకటనలో వెల్లడించింది.

న్యూ ఇయర్ సందర్భంగా పబ్లిక్ ఈవెంట్లకు అనుమతి లేనప్పటికీ, వైన్స్, బార్లకు ఒక గంట సమయం అదనంగా అనుమతించారు. దీంతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 వరకూ అమ్మకాలు కొనసాగాయి. గతేడాది పోలిస్తే.. ఈ నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్లు అధికంగా ఆదాయం వచ్చినట్టు అబ్కారీ శాఖ పేర్కొంది.
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే రూ.300 కోట్ల విక్రయాలు జరిగాయి. మొత్తంగా 8.61 కోట్ల లిక్కర్ కేసులు, 6.62 కోట్ల బీర్ కేసుల అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో, సరిహద్దు జిల్లాల్లో మద్యం అమ్మకాల జోరు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications