Rangareddy: రామోజీ ఫిల్మ్ సిటీలో ఉద్యోగిని ఆత్మహత్య..!

రంగారెడ్డి జిల్లా రామోజీ ఫిల్మ్ సిటీలో విషాదం జరిగింది. ఈనాడు కార్యాలయంలో పని చేస్తున్న సాయికుమారి అనే మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కార్యాలయం నాలుగో అంతస్తు పై నుంచి దూకి బలవన్మరణాకి పాల్పడింది. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. సాయి కుమారి కొద్ది రోజులుగా ఈనాడు ఆఫీస్ లోని కాల్ సెంటర్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం సాయి కుమారి ఆఫీస్ వచ్చారు.

ఆమె పని చేస్తున్న బిల్డింగ్ పైకి ఎక్కి దాని పై నుంచి కిందికి దూకారు. తీవ్ర గాయాలు కావడంతో సాయి కుమారి అక్కడి కక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా సాయి కుమారి భర్త కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.సాయి కుమారి ఎందకు ఆత్మహత్య చేసుకుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత కారణాలతోనే సాయి కుమారి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది.

An employee of Ramoji Film City committed suicide today

అయితే రామోజీ ఫిల్మ్ సిటీ కార్యాలయానికి వెళ్లి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియరాలేదు. సాయికుమారి ఆత్మహత్య చేసుకున్న వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సాయి కుమారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తోటి ఉద్యోగులను ఆరా తీశారు.

కాగా రెండు నెలల క్రితం కూడా ఫిల్మి సిటీలో విషాదం జరిగిన విషయం తెలిసిందే. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ కంపెనీ వ్యవస్థాపకులు క్రేన్ ప్రమాదంలో కింద పడి చనిపోయారు. కార్యక్రంలో క్రేన్ లో ఓక క్యాబిన్ పైకి లేపారు. ఈ క్రమంలో క్రేన్ వైర్ తెగడంతో కింద పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+