Hyderabad: సీబీఐ అధికారులమంటూ ఫోన్.. రూ.50 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు..!
సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా కొంత మంది విశ్రాంత్ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. తాజాగా సీబీఐ పేరుతో ఓ రిటైర్డ్ ఉద్యోగిని మోసం చేసి రూ.35 లక్షలు కాజేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఓ రోజు 65 రిటైర్డ్ ఉద్యోగికి ఓ ఫోన్ కాల్ వచ్చింది.
మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ పై అక్రమ ప్రకటనలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఇలా చేస్తే నీపై ఐపీసీ సెక్షన్ 67 ఏ, సెక్షన్ 354ఏ, సెక్షన్ 499, సెక్షన్ 509 కింద కేసులు పెడతామని హెచ్చరించారు. వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయాలన్నారు. తనకు దొంగ ప్రకటనలకు ఎలాంటి సంబంధం లేదని వృద్ధుడు వారికి వివరించాడు. అతవలి వైపు ఉన్న వ్యక్తి సరే అనే ఫోన్ కట్ చేశాడు.

రెండు మూడు రోజుల తర్వాత బాధితుడికి నకిలీ సీబీఐ ప్రొఫైల్ నుంచి స్కైప్ వీడియో కాలు వచ్చింది. నీ సీబీఐ కేసు నమోదు చేసినట్లు వారు చెప్పారు. కొన్ని ప్రశ్నాలకు సమాధానం చెప్పాలన్నారు. సైబర్ నేరగాళ్లను నిజంగానే సీబీఐ అధికారులుగా నమ్మిన బాధితుడు వారు అడిగిన విషయాలన్ని చెప్పేశాడు. బ్యాంక్ వివరాలు కూడా అడిగారు. విచారణ పూర్తి అయ్యే ఎక్కడి వెళ్లొద్దని ఇంట్లో ఉండాలని కేటుగళ్లు హెచ్చరించారు.
మరుసటి రోజు బాధితుడని రూ.34 లక్షలు బదిలీ చేయాలని చెప్పారు. విచారణ పూర్తిగా కాగానే 3 నుంచి 4 రోజుల్లో డబ్బు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఇది డిపాజిట్ అనిచెప్పారు. దీంతో బాధితుడు వారికి డబ్బు పంపాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బు కావాలని ఒత్తిడి తేవడంతో బాధితుడు భార్య నగలు అమ్మి ఇచ్చాడు. చివరికి ఇది మోసం అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.












Click it and Unblock the Notifications