హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రష్మి ట్వీట్: మంత్రి కేటీఆర్‌కు రిక్వెస్ట్.. సాయం చేయరు..ss

|
Google Oneindia TeluguNews

యాంకర్ రష్మి మంత్రి కేటీఆర్ సహాయం కోరారు. కేటీఆర్ ఆఫీస్ అకౌంట్, కేటీఆర్ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. యాంకర్ రష్మి చేసినట్వీట్ వైరల్ గా మారింది. క్యాజువల్‌గా అయితే రష్మి తనకు సంబంధించిన విషయాలు పోస్టులు చేస్తుంటారు. ఈ సారి మాత్రం ఇతర అంశాన్ని ప్రస్తావించారు. రష్మి..జంతు ప్రేమికురాలు. మూగ జీవాలకు హానీ జరిగితే..వెంటనే స్పందిస్తుంటారు. తాజాగా కూడా ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్‌కు మూగజీవాల సమస్యల గురించి తెలియజేశారు. సమస్యను పరిష్కరించాలని ఆమె కోరారు.

మూగజీవాల కోసం..

మూగజీవాల కోసం..

లాక్ డౌన్ సమయంలో వీధి కుక్కలు, పావురాల కోసం ప్రతిరోజు ఆహారం అందించేవారు. జంతు పరిరక్షణ కోసం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జంతువుల విషయంలోనే మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో శునకాలను యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి అలాగే వదిలేస్తున్నారు. పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆమె మంత్రి కేటీఆర్‌ను కోరారు.

రష్మి రియాక్షన్

రష్మి రియాక్షన్

నెటిజన్ చేసిన ట్వీట్‌పై యాంకర్ రష్మి స్పందించారు. హైదరాబాద్‌లో వీధి కుక్కల సంతతి తగ్గించేందుకు వైద్య సిబ్బంది ఆపరేషన్ చేసి అలాగే వదిలేస్తున్నారు. సేవ్ యానిమల్స్ ఇండియా అనే ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ నెటిజన్ కొంతకాలం నుంచి పోస్టూ చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే రోడ్లపైనే విడిచిపెడుతున్నారని వెల్లడించారు.

ఇదీ శునకాల లెక్క

ఇదీ శునకాల లెక్క

శునకాలకు సంబంధించి ఫొటోలను వివరాలతో సహా దాదాపు 2 వేల 122 కుక్కలకు ఆపరేషన్ చేసి ఇలాగే రోడ్లపై వదిలేశారని ట్వీట్‌లో తెలిపారు. తమకు విధించిన రోజువారీ టార్గెట్‌ను చేరుకోవడం కోసం వైద్య సిబ్బంది ఇలా మూగజీవాలను హింసించడం సరికాదంటున్నారు. ఈ విషయంలో యాంకర్ రష్మి చేసిన ట్వీట్‌తో మంత్రి కేటీఆర్ రియాక్షన్ చూడాలి.

పరిష్కారం దిశగా..

క్యాజువల్‌గానే మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆపన్నులకు సాయం చేస్తుంటారు. రష్మి చేసిన రిక్వెస్ట్‌కు కూడా సానుకూలంగానే స్పందిస్తారు. సో సిటీలో శునకాలను అలాగే వదిలేసే దానికి సంబంధించి పరిష్కారం లభించే అవకాశం ఉంది.

English summary
anchor rashmi tweet to minister ktr. dogs abc operation after leave in hyderabad city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X