Sharmila:షర్మిల పాదయాత్రలో పాల్గొన్న యాంకర్ శ్యామల
తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తోంది. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పాదయాత్ర సందర్భంగా ఇప్పటికే ఆమెను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిశారు. ఇవాళ ఆమె పాదయాత్రలో యాంకర్ శ్యామల పాల్గొన్నారు.
సమాజంలో మార్పు కోసం షర్మిల చేస్తున్న పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని శ్యామల చెప్పారు. షర్మిలతో కలిసి నడవడానికి తాను సిద్ధమని అన్నారు. గత ఎనిమిది రోజులుగా అక్క నడుస్తున్నారని... ప్రతి ఒక్కరు వారి సమస్యలను అక్కతో చెప్పుకుంటున్నారని... ఆ విషయాన్ని తాను స్వయంగా చూశానని చెప్పారు. ఒక సీఎం కూతురు, మరో సీఎం చెల్లెలు అయిన అక్క ఎంతో సంతోషంగా ఉండొచ్చని... కానీ వారి నాన్నగారి ఆశయాలను భుజాన వేసుకుని ముందుకు సాగుతుండటం చాలా గొప్ప విషయమని అన్నారు. అక్కతో కలిసి నడవడానికి తాను సిద్ధమని చెప్పారు.

ఇటీవల షర్మిల పలు సందర్భాల్లో షర్మిల మాట్లాడారు. వైఎస్ఆర్ పాలనలో నిరుద్యోగులు, విద్యార్థులు క్షేమంగా ఉన్నారని షర్మిల అన్నారు. ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోలేదని చెప్పారు. ఐదేళ్లలో మూడుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చి, లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్పారు. 2008లో జంబో డీఎస్సీతో 54 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన మహనీయుడు వైయస్ఆర్ అని గుర్తుచేశారు. ప్రభుత్వ రంగంలోనే కాక ప్రైవేటు రంగంలోనూ 11లక్షల ఉద్యోగాలు సృష్టించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా పేదలకు లోన్లు ఇచ్చి, స్వయం ఉపాధి కల్పించారు. పేదవాడికి జబ్బు చేస్తే ఆ కుటుంబం మొత్తం అప్పుల పాలవుతుందని, ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించారు. ఫోన్ చేసిన 20 నిమిషాలకే పేద వాడి ఇంటి ముందు అంబులెన్స్ వచ్చేలా చేసిన గొప్ప నాయకుడు మన వైఎస్ఆర్ అని చెప్పారు. ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 45 లక్షల ఇండ్లు నిర్మిస్తే.. వైఎస్ఆర్ 46 లక్షల పక్కా ఇండ్లు కట్టించి ఇచ్చారని చెప్పారు. ఒక్క చార్జీ కూడా పెంచకుండా సంక్షేమ పాలన అందించిన రికార్డు సీఎం వైఎస్ఆర్ అని చెప్పారు. 64 లక్షల రైతులకు రుణమాఫీ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తొలుత ఆలోచన చేసిన నాయకుడు వైఎస్ఆర్ అని వివరించారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించారు. పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశంతో ఎన్నో విద్యాసంస్థలు, వర్సిటీలు నెలకొల్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉచిత విద్య అందించారు. వైఎస్ఆర్ హయాంలో ఎంతో మంది పేదలు.. డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. వైయస్ఆర్ గారు ఏం చేసినా అద్భుతంగానే ఉండేది.