Sambasiva Rao: సాంబశివ రావు ఇక మారావా.. మరో కేసు నమోదు..!
ఓ టీవీ ఛానెల్ లో కీలకంగా పని చేస్తున్న సాంబశివ రావుపై మరో కేసు నమోదయింది. టీవీలో కూర్చుండి నీతులు చెప్పే ఆయన మోసాలకు పాల్పడడం సంచనలం రేవుతోంది. తమ రియల్ ఎస్టేట్ కంపెనీనిలో సాంబశివరావు బ్రోకర్‌గా పని చేస్తూ మోసం చేశాడని ఆ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంధ్యా హోటల్స్ ప్రై.లిమిటెడ్ కంపెనీ నిధులతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కారు కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో పోలీసులు సాంబశివరావుపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. సాంబ శివ రావు ఫోర్జరీ డాక్యుమెంట్లతో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ను తప్పుదోవ పట్టించినట్లు కూడా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ ను హెచ్పీసీఎల్ అధికారులు సీజ్ చేశారు. మాదాపూర్ లోసరనాల శ్రీధర్ రావు భార్యకు మాదాపూర్ లో 717 గజాల జాగ ఉంది.

సాంబశివ రావు 2018లో శ్రీధర్ రావును కలిసి హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ డీలర్ షిప్ ఇప్పిస్తానని ఆఫర్ చేశాడు. ఆ తర్వాత ల్యాండ్ ను పోర్జరీ సంతకాలతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు పత్రాలను తయారు చేశాడు. ఆ పత్రాలతో హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్ డీలషిప్ తీసుకున్నాడు. దీంతో శ్రీధర్ రైవు సాంబశివ రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా హెచ్పీసీఎల్ కంప్లెంట్ చేశాడు.
అయితే తన పై వచ్చిన ఆరోపణలను సాంబ శివ రావు ఖండించారు. తనపై కావాలనే బురద జల్లుతున్నట్లు చెప్పారు. అప్పట్లో టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు ఆన్ స్క్రీన్ వార్నింగ్ ఇవ్వడంపై పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడవద్దు అన్నందుకు చంపేస్తారా అని నిలదీశారు. బూతులతో సమాజాన్ని ప్రశ్నించే హక్కు మీడియాకు ఏ రాజ్యాంగం ఇచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications