హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో మరో భారీ అగ్ని ప్రమాదం; రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది!!

హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో హైదరాబాదులో అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ రామ్ గోపాల్ పేట డెక్కన్ మాల్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదాన్ని మర్చిపోకముందే, వరుస అగ్ని ప్రమాదాలు జరగడం భాగ్యనగర వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లిలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామాగ్రి ఉన్న గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విఎస్టి సమీపంలో ఉన్న ఈ గోడౌన్ లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గోడౌన్ లోని మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక గోడౌన్ పరిసరాల్లో బస్తీలు ఉండడంతో, అక్కడ బస్తీ వాసులు తమ ప్రాంతానికి కూడా మంటలు అంటుకుంటాయేమో అన్న ఆందోళనలో ఉన్నారు.

Another huge fire accident in Hyderabad Bagh Lingampally; Firefighters in the field!!

ప్రస్తుతం ఫైర్ ఇంజనీర్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. అగ్నిప్రమాదం కారణంగా దట్టంగా పొగ అలముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది పొగలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. స్థానికులు, ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు విపరీతమైన పొగ కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డెకరేషన్ సామాగ్రి అంతా పూర్తిగా కాలిపోయినట్టు భావిస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? లోపల ఎవరైనా మనుషులు ఉన్నారా? అగ్నిప్రమాదం జరగడానికి కారణాలు ఏమిటి? వంటి అనేక ప్రశ్నలు స్థానికులలో ఉత్తన్నమవుతున్నాయి. మంటలను పూర్తిగా అర్పితే కానీ అగ్ని ప్రమాదానికి గల కారణాలను అంచనా వేసే అవకాశం లేదని స్థానికులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్‌లోని ఓ టైర్ల గోడౌన్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఒక్కసారిగా దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరిపీల్చుకునేందుకు ఇబ్బంది పడ్డారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+