ఎంఐఎం కార్పొరేటర్ల ఆగడాలు.. మరో కార్పొరేటర్ వీరంగం.. ఎస్‌ఐపైనే ప్రతాపం..

ఎంఐఎం కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులపైనే తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇటీవల ఓ కార్పొరేటర్ బీభత్సం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కార్పొరేటర్ తన విశ్వరూపాన్ని చూపించాడు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ ఘటన మరవకముందే పాతబస్తీలో మరో మజ్లిస్ కార్పొరేటర్ రెచ్చిపోయాడు. మీకు ఏం పని, ఎందుకొచ్చారంటూ ఎస్ఐపై చిందులేశాడు. మక్కా మసీదు వద్ద ఘటన జరిగింది.

సమస్య ఏంటీ అంటే..?

సమస్య ఏంటీ అంటే..?

రంజాన్ మాసం కావడంతో ముస్లీంలు మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ప్రార్థనల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తుంటారు. చాలామంది ముస్లింలు ప్రార్థనల కోసం వచ్చారు. వారికి వాహనాలు పార్కింగ్ చేసుకొనేందుకు యానాని హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తారు. ఈసారి అలాంటి ఏర్పాట్లు చేయలేదు. వాహనాలు పార్కింగ్ చేసుకుందామంటే ఆస్పత్రి గేట్లు మూసివేశారు. దీంతో ప్రార్థనలకు వచ్చిన ముస్లింలు రహదారిపైనే వాహనాలను పార్కింగ్ చేశారు.

ట్రాఫిక్ జామ్ కావడంతో

ట్రాఫిక్ జామ్ కావడంతో

అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న మజ్లిస్ కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి అక్కడికి వచ్చాడు. పార్కింగ్ కోసం యానామి ఆస్పత్రి గేట్లు తెరిపించాడు. ట్రాఫిక్ జామ్ అయిందన్న తెలుసుకున్న స్థానిక ఎస్ఐ, పోలీసులు అక్కడి చేరుకున్నారు. దీంతో మీరెందుకు వచ్చారు.. మీకు ఇక్కడ ఏం పని అంటూ ఎస్ఐపై మజ్లిస్ కార్పొరేటర్ మండిపడ్డాడు. ట్రాఫిక్ జామ్ అయిందని ఫోన్ రావడంతో వచ్చామని పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. గట్టిగా అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పోలీసుల పవర్ నడవదు ఇక్కడ..?

పోలీసుల పవర్ నడవదు ఇక్కడ..?

పోలీసుల పవర్ చూపిస్తామంటే ఇక్కడ నడవదు అంటూ ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చేలా బిహేవ్ చేశాడు. వాగ్వివాదం అనంతరం పోలీసులు అక్కడినుంచి వెనుదిరిగి పోయారు. భోలక్ పూర్ కార్పొరేటర్ అరెస్ట్ వ్యవహారంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. రేవ్ పార్టీ రిచ్ కిడ్స్‌ను వదిలేశారని మండిపడ్డారు. కానీ తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తారా అని అడిగారు. చట్టం పేద, ధనిక వర్గాలకు ఒకేలా వర్తించాలని కామెంట్ చేశారు.

మరీ కేటీఆర్ రియాక్షన్..?

మరీ కేటీఆర్ రియాక్షన్..?

ఈ మేరకు హైదరాబాద్ పోలీస్, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. ఇటీవల పబ్ డ్రగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దానిని ఉద్దేశించి అసద్ ట్వీట్ చేశారు. వారిపై చర్యలు తీసుకోరని ఇండైరెక్టుగా కామెంట్ చేశారు. అంతకుముందు సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసు కూడా అలానే నీరు గారిపోయింది. దానిని కూడా ప్రస్తావించారు. అయితే దీనికి మంత్రి కేటీఆర్ ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాలీ మరీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+