మరో ఆర్టీసీ కార్మికుడు మృతి .. శవంతో బైటాయించిన కార్మికులు .. పరిగి డిపోలో ఉద్రిక్తత
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇప్పుడు డోలాయమాన స్థితికి చేరుకుంది. ఆర్టీసీ సమ్మె విరమిస్తామని బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటనతో ఆర్టీసీ యూనియన్లలో విబేధాలు బయటపడ్డాయి. ఇక తాజాగా మరోమారు యూ టర్న్ తీసుకున్న ఆర్టీసీ జేఏసీ సమ్మె కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండానే సమ్మె విరమణ ఆలోచన ఆర్టీసీ కార్మికులను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తుంది. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ డిపో డ్రైవర్ వీర భద్రయ్య ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని, ఉద్యోగాలు ఉన్నాయో లేదో తెలీలేదని తీవ్ర మనోవేదనకు గురై మరణించాడు. దీంతో ఆర్టీసీ కార్మికులు పరిగి డిపోలోకి శవంతో పాటు చొచ్చుకువెళ్ళారు. అక్కడే శవాన్ని ఉంచి ఆందోళన కొనసాగిస్తున్నారు.

తీవ్ర ఆగ్రహావేశాలతో కార్మికులు ఊగిపోతున్నారు. ఇంతమంది కార్మికులు మరణిస్తున్నా చలనం లేని సీఎం తీరుకు నిరసనగా నినాదాలు చేస్తున్నారు. దీంతో వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ డిపోలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆందోళన కారులను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వ తీరు మారకపోవటం, మరోపక్క ఆర్టీసీ కార్మిక కుటుంబాల్లో ఆర్ధిక ఇబ్బందులు, ఇంకొక వైపు ఆర్టీసీ కార్మికుల మరణాలు ఆర్టీసీ కార్మిక లోకాన్ని బాగా టెన్షన్ పెడుతున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications