హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హిందు దేవుళ్లపై వివక్ష, స్టిక్కర్లు తొలగించడం ఏంటీ, జగన్‌పై రాజా సింగ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇప్పుడు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌పై పడ్డారు. అదే సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. అక్కడ గల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి గో బ్యాక్ అనే నినాదం వెనక కుట్ర ఉందన్నారు. జగన్ ఏ దేవుడిని కొలుస్తారో అందరికీ తెలుసు అంటూ కామెంట్ చేశారు. తిరుపతికి చెడ్డపేరు వస్తోందని.. దానికి కారణం జగనే అని విరుచుకుపడ్డారు.

సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీరు వ‌ల్ల తిరుప‌తితోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే చెడ్డ పేరు వ‌స్తోంద‌ని రాజా సింగ్ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ప్రస్తుతం మ‌హారాష్ట్ర సోష‌ల్ మీడియాలో బాయికాట్ తిరుపతి పేరుతో జ‌రుగుతున్న ప్ర‌చారం వైర‌ల్‌గా మారిపోయింద‌న్నారు. సీఎం జ‌గ‌న్ త‌ప్పుడు నిబంధన‌లే వివాదానికి కార‌ణ‌ం అని రాజా సింగ్ ఆరోపించారు.

ap cm jagan Discrimination on hindu devotees

మ‌హారాష్ట్రలో బాయికాట్ తిరుప‌తి అని ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. అలిపిరి వ‌ద్ద వాహ‌నాల‌పై హిందూ దేవుళ్ల చిత్ర‌ప‌టాల‌ను తొల‌గిస్తున్నారని మండిప‌డ్దారు. జ‌గ‌న్ త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్ల హిందూ దేవుళ్లకు చెడ్డ పేరు వ‌స్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శివాజీ విగ్ర‌హాల‌ను అడ్డుకోవ‌డం మ‌హారాష్ట్రలో పెద్ద వివాదంగా మారిందని గుర్తు చేశారు.

జ‌గ‌న్ ఏ దేవుడిని న‌మ్ముతారో దేశ ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని రాజా సింగ్‌ తెలిపారు. సీఎం జ‌గ‌న్ తీరుతో తిరుప‌తికి, ఏపీకి చెడ్డ పేరు వస్తోంద‌ని గుర్తుచేశారు. హిందూ దేవుళ్ల పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఇదీ సరికాదని ఆయన వివరించారు. జగన్ చేసే చర్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

English summary
andhra pradesh cm jagan mohan reddy Discrimination on hindu devotees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X