Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సోయి వచ్చిందా కేసీఆర్ సార్.. ఇకనైనా మారు.. షర్మిల సెటైర్లు

హుజురాబాద్‌లో బీజేపీ ఢంకా బజాయించింది. ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల స్పందించారు. విమర్శల జడివాన కురిపించారు.

సోయి వచ్చిందా సారు..

సోయి వచ్చిందా సారు..

హుజూరాబాద్ ఓటమితో కేసీఆర్‌కు సోయి వచ్చినట్టు ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా కేసీఆర్ సార్ అని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు ఉద్యమకారులని, బానిసలు కాదని అర్థమైందా అని విమర్శించారు.రూ. 100 కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేక పోయారని గుర్తుచేశారు. డబ్బుతో జనాలను కొనలేమని అర్థమైందా? అని అడిగారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పతనం ప్రారంభం అయ్యిందని చెప్పారు. ప్రజలకు ఏంటో బాగా తెలుసు అని.. సమయం చూసి తగిన బుద్ది చెప్పారని వివరించారు.

 పతనం ప్రారంభం..

పతనం ప్రారంభం..

హుజూరాబాద్‌తో‌నే కేసీఆర్ పతనం ప్రారంభం అని ఉప ఎన్నిక ఫలితంతో తేటతెల్లం అయ్యిందని చెప్పారు. రాష్ట్రంలో గల అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని పేర్కొన్నారు. చివరికి దళితబంధు అని పెట్టినా కేసీఆర్‌ను ప్రజలు విశ్వసించలేదని షర్మిల విమర్శించారు. మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని.. బై పోల్ ఫలితంతో అదీ రుజువు అయ్యిందని వివరించారు.

 జస్ట్ 2 వేలు

జస్ట్ 2 వేలు

హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ 23 వేల ఓట్లో విజయం సాధించారు. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని అంచనా వేశారు. ఆయన అంచనా దాదాపుగా నిజం అయ్యింది. 2 వేల లోపు ఓట్ల తేడానే కనిపించింది. హూజూరాబాద్ మున్సిపాలిటీ, హుజూరాబాద్ మండలంలో బీజేపీకి ఓట్లు రావాలంటే కష్టమని తాము ముందుగా భావించామని... అయితే మండలానికి సంబంధించిన అన్ని రౌండ్లలో బీజేపీకి ఆధిక్యత వచ్చిందని రఘునందన్ రావు వివరించారు.

విజయమో

విజయమో

హుజురాబాద్ ఎన్నిక ఈటల రాజేందర్‌కు జీవన్మరణ సమస్య.. గెలిచి తీరాలని పట్టుబట్టారు. రాజీనామా చేసిన సమయం నుంచి ప్రజలతో కలిసిపోయారు. జనాలకు గిప్టులు ఇస్తున్నారని అధికార పార్టీ ప్రచారం చేసినా.. నిలువలేదు. వాస్తవానికి అక్కడ టగ్ ఆఫ్ వార్ నడిచింది. ఈటల రాజేందర్ గెలుస్తాడని అంతా భావించారు. కానీ మెజార్టీ మాత్రం ఈ స్థాయిలో వస్తుందని అనుకోలే.. ఊహించలేదు. 10 వేల లోపు మెజార్టీ వస్తుందని అంతా అంచనా వేశారు. కానీ ఈటల రాజేందర్.. కారుకు పంక్చర్ చేయడంతో కమలం వికసించింది.

బానిస కాదు

బానిస కాదు

హుజూరాబాద్‌లో కేసీఆర్‌కు ప్రజలు బాగా బుద్ధి చెప్పారని షర్మిల అన్నారు. తెలంగాణ ప్రజలు బానిసలు కాదు. తెలంగాణ ప్రజలు ఉద్యమకారులని నిరూపించారు. వందల కోట్లు ఖర్చుపెట్టినా.. హుజురాబాద్ ప్రజలు చెంప చెల్లుమనిపించారని చెప్పారు. పిట్టలదొర చెప్పిన కథలను ప్రజలెవరు నమ్మలేదన్నారు. నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు బై ఎలక్షన్‌కు నామినేషన్ వేయబోతే వారందరిని వెళ్లగొట్టి, రిటర్నింగ్ ఆఫీసర్‌ను కొనేసుకుని నామినేషన్లు స్వీకరించకుండా చేశాడని అన్నారు. అయినా కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్నారు.

పథనం

పథనం

కేసీఆర్ పథనం మొదలైందన్నారు. ఇప్పటి నుంచి కేసీఆర్‌ను రాళ్లతో కొట్టే రోజు అతి దగ్గరలో ఉందన్నారు. కేసీఆర్ పిట్ట కథలను నమ్మకండి అన్నారు. గాడిదకు రంగుపూసి ఇది ఆవు అని కేసీఆర్ నమ్మించగలడని వివరించారు. నల్గొండ జిల్లాకు వైయస్ఆర్ 30 సార్లు వచ్చారు. కానీ కేసీఆర్ ఉప ఎన్నికలు ఉంటే మాత్రమే ఆ ప్రాంతానికి వెలుతున్నారు. ఎస్ఎల్ బీసీ, డిండీ, నాగులదండీ ప్రాజెక్టులు పూర్తి కాలేదంటే దానికి కారణం ఎవరూ..? నిరుద్యోగంతో బాధపడి మహేష్ అనే యువకుడు టెట్ కోసం ఎదురు చూసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక వచ్చిన ప్రైవేటు ఉద్యోగాల్లో చాలీ చాలని జీతాలకు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.

నిరుద్యోగుల ఆత్మహత్య

నిరుద్యోగుల ఆత్మహత్య

అమ్మానాన్న నేను ఉద్యోగం సంపాదించలేకపోయానని, కేసీఆర్ చావుతోనే నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగిపోయి ఉద్యోగాలు అందరికీ రావాలని, చావుకు కేసీఆర్ కారణమని లేక రాసి చనిపోయాడని అన్నారు. పత్తి చేనులో ఆత్మహత్య చేసుకున్న మహేష్ పార్థీవదేహాన్ని కనీసం పోస్ట్ మార్టన్ కూడా చేయకుండా ఆ చేనులోనే అప్పులు ఉన్నాడని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. మహేష్ చావుకు కేసీఆర్ కారణం కనుక కేసీఆర్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న మోసగాడు కేసీఆర్. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు భర్తీ చేయని కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి అవసరమా..? కేసీఆర్ కొడుకు కేటీఆర్ 4 నుంచి 5 శాతం మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలం అంటున్నారు. కానీ వాళ్లింట్లో ఐదుగురికి ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. తెలంగాణలో యువకులకు కష్టపడి పని చేసే తత్వం లేదని కేటీఆర్ అంటున్నారు. పనిచేయడం రానిది కేసీఆర్, కేటీఆర్‌కు అన్నారు.

ధర్నాలు

ధర్నాలు

ఉద్యమంలో యువత రోడ్ల మీద ధర్నాలు చేసి లాటీ దెబ్బలు తినకపోతే తెలంగాణ వచ్చేదా..? చేసిందంతా యువత అయితే వాళ్లు పదవులు అనుభవిస్తున్నారు. నిరుద్యోగుల ఉద్యోగాల కోసం మేం కొట్లాడుతాం. దయచేసి నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. అన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేస్తున్నాం అని వివరించారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోతే కేసీఆర్ పదవికి రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ ఐదు సంవత్సరాలలో అద్భుతమైన పాలన చేశారని వివరించారు. ఉచిత విద్యా, వైద్యం, కరెంట్, మహిళలలు డ్వాక్రా రుణాలు ఇలా ఎన్నో పథకాలు పాదయాత్రతో సమస్యలు తెలుసుకుని ప్రవేశపెట్టారు.

గర్వంగా ఉంది

గర్వంగా ఉంది

వైఎస్ఆర్ తండ్రి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. వైఎస్ఆర్ ఐదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు 64 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారని వివరించారు. ప్రపంచంలో ఎవరూ ఆలోచన చేయని విధంగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి, పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించారు. 108 సేవలు ప్రవేశపెట్టి, 20 నిమిషాల్లో ఇంటి వద్దకే అంబులెన్స్ వచ్చేలా చేశారు. ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 45 లక్షల ఇళ్లు నిర్మిస్తే.. వైఎస్ఆర్ ఒక్కరే రాష్ట్రంలో 46 లక్షల పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించాలని తొలి ఆలోచన చేసిందే వైఎస్ఆర్ అన్నారు.

ఫీజు రీయింబర్స్ మెంట్

ఫీజు రీయింబర్స్ మెంట్

ఫీజు రీయింబర్స్ మెంట్
మహిళలకు పావులా వడ్డీకే రుణాలు ఇచ్చి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా పేదింటి పిల్లలకు ఉన్నత విద్య అందించారు. ఎంతోమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు అయి ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు. వైఎస్ఆర్ అన్ని సంక్షేమ పథకాలను అద్భుతంగా నడిపించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఐదేళ్లలో నిరుద్యోగుల కోసం మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రైవేటు రంగంలో 11లక్షల ఉద్యోగాలను సృష్టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్ లోన్లు అందించి స్వయం ఉపాధిని ప్రోత్సహించారు. ఐదేండ్లలో ఒక్క పన్ను పెంచకుండా పాలన సాగించిన రికార్డు వైఎస్ఆర్ అని చెప్పారు. వైఎస్ఆర్ ఎప్పుడూ పేద పిల్లల గురించే ఆలోచించేవారు. రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, పేదలను ఇలా అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని వివరించారు. ఏడేళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. కేసీఆర్ పట్టించుకోలేదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+