ఆజామాబాద్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌పై దుండగుల దాడి: విధ్వంసం(వీడియో)
హైదరాబాద్: నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌పై కొందరు దుండగులు దాడులకు తెగబడింది. 15 మంది సభ్యులున్న ఈ ముఠా.. కర్రలు, రాడ్లతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌పై విరుచుకుపడింది. షాపులోని వస్తువులన్నీ ధ్వంసం చేశారు.
ఫర్నీచర్, ఫ్రిజ్‌లు, టేబుళ్లు కూర్చీలు ఇలా కనిపించిన వస్తువులన్నీ విరగొట్టేశారు.
ముఖాలకు మాస్కులు ధరించి.. నిర్వాహకులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఆజామాబాద్‌లోని స్పైస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌పై ఈ దాడి జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Attack on fast food center in Chikkadpally in Hyderabad @hydcitypolice
— Lokesh journo (@Lokeshpaila) October 1, 2020
Some miscreants came in masks and attacked the fast food centre Named spice court
Police filed a case and investigating
Is it a business rivalry or any feud between them ? pic.twitter.com/yquQ17NOHT
హత్య కేసు: ముగ్గురిపై రౌడీషీట్ ఓపెన్
భర్తను హత్య చేసిన భార్యతోపాటు మరో ఇద్దరు యువకులపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. తాండూరు గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన నాగరాజు గౌడ్(47)ను హత్య చేయడానికి ఆయన భార్య లక్ష్మితోపాటు అదే గ్రామానికి చెందిన చాకలి బాల్‌రాజ్, సాతమోళ్ల శంకర్, పండ్ల పవన్ కుమార్ కుట్ర పన్నారు.
ఆగస్టు 12న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న నాగరాజు గౌడ్‌ను ఇనుపరాడ్డుతో కొట్టి చంపారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని సిమెంట్ స్తంభానికి కట్టి తాండూరులోని గొల్లచెరువులో పడేశారు. కాగా, తండ్రి కనిపించకపోవడంతో కూతురు శ్రీయగౌడ్ ఆగస్టు 14న కరణ్ కోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఆగస్టు 28న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నాగరాజు భార్య లక్ష్మి, బాల్‌రాజ్, శంకర్ భవిష్యత్తులో ఇతర నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు రౌడీ షీట్ తెరిచినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications