హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదీ ట్రైలరే, ముందుంది సినిమా, గంటలు గంటలు ఆడియో, వీడియో: కేటీఆర్

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. బేరాలు జరిపిన ఆ ముగ్గురిని ఇప్పటికే రిమాండ్‌కు కూడా తరలించారు. ఈ విషయంపై అధికార పార్టీ మీడియా ముందుకు రాలేదు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు.. మీడియా ముందుకు వచ్చి మాట్లాడారని లీకులు వచ్చినా.. రాలేదు. కానీ నిన్న మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అదీ కూడా ఓ ఇంటర్వ్యూలో సందర్భంగా వచ్చిన సమయంలో కామెంట్ చేశారు. ఇప్పుడు వచ్చిన ఆడియో ట్రైలర్ మాత్రమేనని చెప్పారు. ముందు ఉంది అసలు సినిమా అని మరింత హైప్ తీసుకొచ్చారు.

గంటలు గంటల ఆడియో, వీడియో..

గంటలు గంటల ఆడియో, వీడియో..

కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి గంటల గంటలు ఆడియో, వీడియో ఉందని కేటీఆర్ హింట్ ఇచ్చారు. అధికార పార్టీ నేత, బాధ్యతాయుతమైన మంత్రి పదవీలో ఉండి కామెంట్ చేయడం కుదరదని.. అందుకే మేం చెప్పడం లేదన్నారు. కేసు విచారణను పోలీసులు చేపడుతున్నారని.. నిజ నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. తాను మాట్లాడితే మంత్రి మాట్లాడారని.. కేసు విచారణను బదిలీ చేయాలని వారు కోరతారని చెప్పారు. అందుకే తమ పార్టీ రియాక్ట్ కాలేదని చెప్పారు. నేతలందరూ కూడా సంయమనం పాటించాలని కోరామని వివరించారు.

చేయాల్సిన తప్పులు చేసింది..

చేయాల్సిన తప్పులు చేసింది..

శిశుపాలుడిలా బీజేపీ కూడా చేయాల్సిన తప్పులన్ని చేసిందన్నారు. శిశుపాలుడిని శ్రీకృష్ణుడు శిక్షించినట్టుగా బీజేపీని కూడా మునుగోడు ప్రజలు శిక్షించాలని కోరారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ డబ్బులతో కొనాలని చూస్తోందని వివరించారు. జూటా, జుమ్లా బీజేపీని ప్రజలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఏం జరుగుతుందోననే అంశం బీజేపీకి అర్థమయ్యిందని.. అందుకే కొనుగోలుకు తెరతీసిందన్నారు. ఆ నలుగురు బాధ్యతాయుతమైన కార్యకర్తలుగా ఉన్నారని.. వారు ప్రలోభాలకు లొంగలేదని గుర్తుచేశారు. వారిని చూసి తను గర్విస్తున్నానని మంత్రి కేటీఆర్ తెలిపారు.

మోడీకి భయం

మోడీకి భయం

బీఆర్ఎస్ విస్తరణ కూడా జరుగుతుందని వివరించారు. త్వరలోనే దేశవ్యాప్తంగా తమ పార్టీ విస్తరిస్తోందని పేర్కొన్నారు. కానీ ప్రధాని మోడీ తమ పార్టీకి పర్మిషన్ ఇస్తారో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. భయపడుతున్నందునే ఆలస్యం చేస్తున్నారని వివరించారు. దసరా మరునాడు ఆప్లై చేస్తే.. ఇప్పటికీ అతీ గతీ లేదని చెప్పారు.

English summary
audio, video clips are have in police minister ktr reacts about mlas proach issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X