Hyderabad: హైదరాబాద్‍లో ఆ రోజు ఆటోలు బంద్.. ఎందుకంటే..
తమ డిమాండ్లను పరిష్కరించకుంటే సచివాలయ ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు.
తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అమానుల్లాఖాన్ హెచ్చరించారు. ఆటో ఛార్జీల పెంపుతో పాటు ఆటో డ్రైవర్ల సమస్యలు, ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
లేకుంటే జంటనగరాల్లోని ఆటో డ్రైవర్లు ఏప్రిల్ 30న ఆటోలు బంద్ చేస్తామన్నారు. ఆ రోజు సచివాలయ ప్రారంభోత్సవాన్ని కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు.
జంట నగరాల్లోని అన్ని వైపుల రోడ్లను దిగ్బంధిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆటోడ్రైవర్ల డిమాండ్‌లను పరిష్కరించకుండా పేదల సొమ్ముతో నిర్మించిన కొత్త సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి ఎలా ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌తో సమానంగా ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలని, ప్రతి ఆటోకు వార్షిక బీమా సర్టిఫికెట్ ఛార్జీలు, ఇతర ఖర్చుల చెల్లింపు కోసం రూ. 10,000 అందించాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీలో మాదిరిగా బైక్‌లు, ట్యాక్సీలపై నిషేధం విధించాలని కోరారు. కొత్త ఎలక్ట్రిక్ ఆటోల రిజిస్ట్రేషన్, బదులుగా ఇప్పటికే ఉన్న అన్ని ఆటోలను GHMC ప్రాంతంలో తిరుగుతున్న ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చలని కోరారు. ప్రైవేట్ ఆటో ఫైనాన్షియర్ల వేధింపులు, రవాణా, పోలీసు శాఖల్లో జరుగుతున్న అవినీతి, వేధింపులను అరికట్టేందుకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications