హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎప్పటిలాగే ఈసారి కూడా.. ప్రశాంత వాతావరణంలో బక్రీద్: సీపీ అంజనీకుమార్

|
Google Oneindia TeluguNews

త్యాగాలకు ప్రతీకైన బక్రీద్. ​పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్​ కమిషనర్​అంజనీకుమార్​ విజ్ఞప్తి చేశారు. బక్రీద్​ పురస్కరించుకుని పాతబస్తీ సాలార్​జంగ్ ​మ్యూజియంలో జరిగిన సమావేశానికి అంజనీకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచే శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు.

అల్లా ఆదేశాలపై ఇబ్రహీం అలే సలాం తమ కుమారుని ఖుర్భాని ఇవ్వడానికి సిద్దమయ్యాడని.. కుల మతాలకు అతీతంగా దురలవాట్లకు దూరంగా ఉండాలని సీపీ కోరారు. ఇస్లాంలో అనారోగ్యంగా ఉన్న జంతువుల ఖుర్భానికి అనుమతి లేదని, అలాంటి జంతువుల మాంసం తినేవారు కూడా అనారోగ్యాల భారిన పడుతారని ప్రతీతి అని గుర్తుచేశారు. వ్యాపారులు కూడా నిషేధించిన జంతువులను కొనుగోలు చేయవద్దన్నారు.

 bakrid eve should be celebrated in a peaceful atmosphere

జంతువులతో వస్తున్న వాహనాలను పోలీసులే తనిఖీలు చేస్తారని, నిబంధనలకు విరుద్దంగా ఉన్న జంతువులను స్వాధీనం చేసుకుంటారని సీపీ అంజనీకుమార్ తెలిపారు. పోలీసులకు తప్ప వాహనాలను ఆపే హక్కు ఎవరికీ లేదన్నారు. కొందరు కావాలనే ప్రశాంతంగా ఉన్న నగర వాతావరణాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారని సీపీ అన్నారు. అలాంటి వారి ప్రయత్నాలను కలిసికట్టుగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. బక్రీద్ ​పండుగ సందర్భంగా పాతబస్తీలో మూడు రోజుల పాటు ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసి అధికారులు జంతువుల వ్యర్థాలను తొలగిస్తారని చెప్పారు.

జీహెచ్‌ఎంసీ సరిహద్దుల్లో కొందరు వాహనాలను ఆపి తప్పుదోవ పట్టిస్తున్నారని, నిబంధనలను పాటిస్తూ తెచ్చుకున్న జంతువులను అనుమతించాలని యాకత్‌పురా ఎమ్మెల్యే పాషాఖాద్రి, వక్ఫ్​బోర్డ్​ చైర్మన్​ సలీం కోరారు. పండుగ రోజు నగరంలోని స్లాటర్​హౌజ్‌ తెరిచి ఉంటాయని, ప్రజలు తమ జంతువులను స్లాటర్ హౌజ్‌ల వద్దకు తీసుకువచ్చి కట్ చేయించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రియాజుల్ హసన్, జోనల్ కమిషనర్ అశోక్​ సామ్రాట్, పోలీసు ఉన్నతాధికారులు డిఎస్​చౌహాన్, షికా గోయల్, అనిల్ కుమార్, సౌత్​జోన్ ​డిసిపి గజరావు భూపాల్, ముస్లిం మత పెద్దలు ముర్తూజా పాషా, జాఫర్​ పాషా, హాబేజ్ ముజఫర్, సయీద్​ఖాద్రి పాల్గొన్నారు.

English summary
bakrid eve should be celebrated in a peaceful atmosphere. cp anjani kumar said to religious elders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X