బండి పాదయాత్ర మరోసారి వాయిదా.. కారణం ఇదే, మళ్లీ ఎప్పుడంటే,
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ నెల 24 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తానని ప్రకటించారు.ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ మరణం వల్ల కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్టు బండి సంజయ్ ప్రకటించారు. పార్టీ పరంగా ఆరు రోజులు సంతాప దినాలు పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. మాజీ సైనికాధికారులు కూడా పార్టీలో చేరే కార్యక్రమానికి వాయిదా వేసినట్టు చెప్పారు.
కల్యాణ్ సింగ్ మృతి తీరని లోటు అని, పార్టీ తరఫున సంతాప దినాలు పాటిస్తామని బండి సంజయ్ వివరించారు. కల్యాణ్ సింగ్ క్రమశిక్షణకు మారుపేరు అని వెల్లడించారు. కల్యాణ్ సింగ్ బతికి ఉన్నంతకాలం అయోధ్యలో శ్రీరాముడి భవ్య రామాలయం కోసం తపించారని తెలిపారు. యూపీకి రెండు సార్లు సీఎంగా, రాజస్థాన్ గవర్నర్‌గా సేవలందించారని గుర్తు చేశారు.

వాస్తవానికి బండి సంజయ్ ఆగస్ట్ 9న పాదయాత్ర ప్రారంభించాలని అనుకున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర నేపథ్యంలో దీనిని వాయిదా వేశారు. ఈ నెల 24 నుంచి పాదయాత్ర చేపట్టాలని ఫిక్స్ అయ్యారు. దీంతో బీజేపీ శ్రేణులు పాదయాత్ర కోసం ఏర్పాటు చేస్తున్నాయి. ఈ యాత్ర విజయవంతం కోసం పార్టీకి చెందిన పలు కమిటీలు పనిచేస్తున్నాయి.
యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మృతితో ఆగస్టు 24 వరకు సంతాప దినాలుగా బీజేపీ ప్రకటించింది. మరోవైపు 24 నుంచే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండేది. సంతాప దినాల నేపథ్యంలో పాదయాత్రను వాయిదా వేస్తున్నట్టుగా బండి సంజయ్ ప్రకటించారు. వివిధ కారణాలతో బండి సంజయ్ పాదయాత్ర రెండు సార్లు వాయిదా పడింది. ఇదీ బీజేపీ క్యాడర్‌ను నిరుత్సాహ పరిచింది. ఈ నెల 30 నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబున్నారు. అయితే బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభ తేదీపై అధికార ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.
Recommended Video
ఇటు బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. 'ప్రజా జీవన యాత్ర' పేరుతో హుజూరాబాద్ నియోజకవర్గంలో గల కమలాపూర్ మండలం బత్తినవారిపల్లి నుంచి ప్రారంభం అయ్యింది. నియోజకవర్గంలో వివిధ గ్రామాల మీదుగా 23 రోజుల పాటు ఈటల పాదయాత్ర చేయాల్సి ఉంది. మొత్తం 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో.. 270 కిలోమీటర్లు ఈటల రాజేందర్ పాదయాత్ర చేయాలి.. కానీ అస్వస్థత కారణంగా పాదయాత్రకు మధ్యలోనే బ్రేక్ పడింది. మరోవైపు మోకాలికి ఆపరేషన్ జరిగింది. దీంతో వైద్యులు పాదయాత్ర చేయొద్దని సూచించారు. దీంతో ఆయన పాదయాత్రకు శాశ్వతంగా బ్రేక్ పడినట్టే అవుతుంది. దీనిపై ఈటల అండ్ కో ప్రకటన చేయాల్సి ఉంది.
-
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!












Click it and Unblock the Notifications