బండి సంజయ్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఇదే.. వైఎస్ నడిచిన దారిలోనే.. ఇందుకేనా..?
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు అయ్యింది. ఆగస్ట్ 9వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో మొదట విడత పాదయాత్ర ఉంటుంది. ఇదీ మాజీ సీఎం, దివంగత వైఎస్ఆర్ పాదయాత్ర చేపట్టిన రూటే.. అంటే బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బండి సంజయ్ ప్రయత్నం చేస్తున్నారని అర్థం అవుతోంది.
బండి సంజయ్ నాలుగు, ఐదు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు. మొదట విడతలో భాగంగా పాదయాత్ర క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజున ఆగస్ట్ 9వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల వరకు రానున్న రెండున్నరేళ్లు పాదయాత్రలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు.

తొలి విడతలో 55 రోజుల పాటు 750 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్లు బండి సంజయ్ పాదయాత్ర చేస్తారు. పాతబస్తీ, ఆర్యమైసమ్మ, మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ మీదుగా పాదయాత్ర జరుగుతుంది. తొలి విడత పాదయాత్రను హుజురాబాద్‌లో ముగిస్తారు.
Recommended Video
ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తానని తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బండి సంజయ్ తేదీతోపాటు రూట్ మ్యాప్ కూడా ప్రకటించారు. దీంతో తెలంగాణ గట్టు మీద పాదయాత్రల ద్వారా ప్రజల సమస్యలను నేతలు తెలుసుకోబోతున్నారు. మరీ వారిని జనం ఏ మేరకు విశ్వసిస్తారో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications