Vijay Devarakonda:పాన్‌ఇండియా సినిమాకు రౌడీబాయ్ గ్రీన్ సిగ్నల్..!

అమ్మాయిలకు హార్ట్ థ్రోబ్, యంగ్స్‌టర్స్‌కు కిక్ ఇచ్చే జోష్‌ఫుల్ హీరో విజయ్ దేవరకొండ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రౌడీ బాయ్... తాజాగా మరో చిత్రానికి సైన్ చేసినట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది. లైగర్‌తో ఫ్లాప్ మూటగట్టుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం రొమాంటిక్ లవర్ బాయ్‌ పాత్రతో ఫ్యాన్స్‌ను ఫిదా చేయనున్నాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో మూడు మైటీ ప్రాజెక్టులున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్ ఒక్కో జార్నర్‌లో ఉంది. రొమాంటిక్ ఎంటర్‌టెయినర్‌గా తెరకెక్కుతోన్న ఖుషీ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి సాంగ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ చిత్రంపై మాంచి క్రేజ్‌ను పెంచేశాయి. అందులో సమంతా విజయ్‌కు జోడీ కడుతుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక విజయ్ దేవరకొండ సైన్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్‌కు నిర్మాత దిల్‌ రాజు. ఇక దిల్ రాజు-విజయ్ కాంబో అంటే చెప్పక్కర్లేదు. ఈ చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో అప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీ గుసగుసలాడుతోంది.

 vijaydevarakonda-dilraju-indragantimohankrishna-

విజయ్ దేవరకొండ- దిల్ రాజు చిత్రానికి డైరెక్టర్ ఎవరనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి టైటిల్‌గా జటాయు అని డిసైడ్ అయ్యిందట చిత్రబృందం. పాన్‌ఇండియా చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో ఎవరిని హీరోగా తీసుకుందామా అని ఆలోచన చేసిన సమయంలో వీరి దృష్టికి ఈ రౌడీబాయ్ వచ్చాడట. ఇంకేముందు వెంటనే విజయ్‌ను అప్రోచ్ అవడం ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయినట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి.

విజయ్ దేవరకొండ- దిల్ రాజు- ఇంద్రగంటిల మైటీ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతమైన స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే దిల్ రాజు నిర్మాతగా పరుశురాం డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత మళ్లీ దిల్ రాజు బ్యానర్‌లోనే ఈ కొత్త చిత్రం ఉంటుంది. మొత్తానికి వరుస సినిమాలు విజయ్ చేస్తుండటంతో ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+